హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు. త్రిమూర్తులలో చివరివాడైన శివుడిని స్మరించడానికి ఎన్నో నియమాలు, నిబంధనలు ఉన్నాయి. శివుడిని ప్రార్థిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. శివుడిని ఆరాధిస్తే కష్టాలు రావు. శివమంత్రాలను స్మరించడం ద్వారా దేవుని అనుగ్రహం పొందవచ్చు. అయితే వాటిని స్మరించటానికి, ఉపదేశించటానికి ఎన్నో నియమనిబంధనలు ఉన్నాయి. ఆ నియమనిబంధనలను ఎట్టి పరిస్థితుల్లోను ఉల్లంఘించకూడదు. 
 
అయితే నియమాలు లేకుండా ఒక మంత్రం స్మరించడం ద్వారా మన కోరికలు తీరతాయి. శివాయ గురవే నమః సర్వాన్ని ప్రసాదించే శివ మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం ఎంతో శ్రేష్టం. ఈ మంత్రాన్ని జపించటానికి ఎటువంటి నియమాలు అవసరం లేదు కాబట్టి ఈ మంత్రాన్ని పరమమంత్ర సామ్రాట్ అని అంటారు. శివుని గురుస్వరూపాన్ని పురాణాల్లో దక్షిణామూర్తిగా అభివర్ణిస్తారు. దక్షిణ అంటే సమర్థత అనే అర్థం వస్తుంది. 
 
దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించే రూపమే దక్షిణామూర్తి. శివుడి గురు స్వరూపమైన దక్షిణామూర్తి మొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు. అనంతరం వశిష్టునికి, సనకసనందనాదులకు దర్శనమిచ్చారు. ఎవరైతే శివాయ గురవే నమః మంత్రాన్ని స్మరిస్తారో వారికి బుద్ధికి వికసిస్తుంది. బ్రహ్మ, విష్ణు, సూర్య, స్కంద, ఇంద్ర ఇతరులు దక్షిణామూర్తిని పూజించి గురుత్వాన్ని పొందవచ్చు. మంత్ర శాస్త్రంలో దక్షిణామూర్తి స్వరూపాన్ని వివిధ రూపాలుగా పేర్కొన్నారు. 
 
దక్షిణామూర్తి రూపాలలో మేధా దక్షిణామూర్తి, శుద్ధ దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తిచశక్తి దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, ఇతర రూపాలు ఉన్నాయి. మేధా దక్షిణామూర్తి పిల్లలకు చదువుతో పాటు బుద్ధిని కూడా ప్రసాదిస్తాడు. విద్యాబుద్ధుల సరస్వతీ దేవి తరువాత మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా కొలుస్తారు. ప్రతిరోజూ దక్షిణామూర్తిని స్మరిస్తే విద్యార్థులు విద్యాబుద్ధులు పొందుతారు.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: