హ‌నుమంతుడు.. భక్తులెందరికో ఆరాధ్య దైవం. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌క్తులు ఉన్నారు. ఆంజనేయ స్వామిని పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం అక్క‌ర్లేదు.

IHG

ఇక హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. ఇక హనుమంతుడు శ్రేష్ఠమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకు ఎల్లప్పుడు అండగా ఉంటాడని ఎంతో మంది విశ్వసిస్తుంటారు. ఇవ‌వ‌న్నీ ప‌క్క‌న పెడితే.. హ‌నుమంతుడిని శ‌నివారం పూజించ‌మ‌ని చాలా మంది చెబుతుంటారు. 

IHG

అయితే హ‌నుమంతుడిని శ‌నివారం పూజించ‌డం వెన‌క అస‌లు క‌థ ఏంటి అన్న సందేహం చాలా మంది ఉంది.  అయితే  హ‌నుమంతుడిని శ‌నివారం పూజించ‌డం వెనుక ఒక కథ వెలుగులో ఉంది. ఒకసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించాడు. 
అయితే ఆంజ‌నేయస్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగురవేయసాగాడు. 

IHG

దీంతో శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా.. స్వామి తనను, తమ భక్తులను ఎప్పుడు పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయస్వామి ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి , శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైన స్వామిని పూజ చేసుకోవచ్చని చెబుతారు.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: