సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో కీలక ఘట్టం రంగం కార్య‌క్ర‌మం ముగిసింది. క‌రోనాపై అమ్మ‌వారి వాక్కు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి రూపంలో వినిపించింది. ఎవరు చేసుకున్న దానికి వారు అనుభవించక తప్పదని స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపింది. బోనాల సందర్భంగా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించడం సంప్రదాయంగా వస్తున్న విష‌యం తెలిసిందే. బోనాల్లో భాగంగా ఇవాళ ఉదయం రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజలందరూ ముడుపులు చెల్లించారని... సంతోషంగా వాటిని అందుకున్నట్లు తెలిపింది. తనకు పూజలెందుకు ఆపుతున్నారని ప్రశ్నించింది. 

 


తప్పకుండా బోనం సమర్పించాలని  పేర్కొంది.  రాబోయే రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కరోనా కట్టడి చేసేందుకు తాను ఉన్నానని స్వర్ణలత భవిష్యవాణిలో గుర్తు చేశారు.కానీ, తనకు మాత్రం సంతోషం కలుగలేదని చెప్పుకొచ్చారు. ప్రజలు ఈ స్థితిలో ఉండాడం ఎంతో బాధ కలిగిస్తోందని చెప్పారు. ప్రజలందరినీ కాపాడుతానని.. కానీ, రాబోయే రోజుల్లో కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయాలని... అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుందని పేర్కొంది. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిచ్చింది. 

 


ఐదు వారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు, మారు బోనం సమర్పించాలని... ఎలాంటి ఆపద రానివ్వనని స్వర్ణలత తెలిపింది.సాకబెట్టి.. నాకు యజ్ఞ హోమాలు జరిపించండి. కామంతో, కోపతాపలతో కాదు.. భక్తిభావంతో చేస్తే తప్పనిసరిగా కాపాడతాను. గడప గడప నుంచి నాకు ఫలహారాలు ఐదువారాలు తప్పనిసరిగా రావాలి. మహమ్మారిని తప్పకుండా తొలగిస్తా’’నని ఆమె చెప్పారు. గంగాదేవికి పూజలు జరిపించినట్లు అయితే సంతోషంతో మీరు కోరుకున్నది తప్పక నెరవేరుస్తుందన్నారు. ఆలస్యమైనా వర్షాలు కురుస్తామని భరోసా ఇచ్చింది.. భక్తి భావంతో తనను కొలిస్తే కాపాడుతునానని భవిష్యవాణిలో వినిపించారు.  ప్రతి గడప నుంచి తనకు మొక్కులు చెల్లించాలి చెబుతూనే.. ఈ మహమ్మారి నుంచి అందరినీ కాపాడుతానని భవిష్యవాణి ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: