ఒకానొక కల్పకాలంలో సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్దనుంచి వేదాలు స్వాధీనం చేసుకొని, సముద్రపు అట్టడుగున దాక్కున్నాడు. సృష్టి ఆగి పోయింది. దేవతలంతా వేదావిజ్ఞానాన్ని కోల్పోయిన వారయ్యారు. సమస్తశాస్త్రములు, కళలు, పురాణములు అన్నీ వేదా లలో సూచ్యంగా చెప్పబడిన వాటిని వాచ్యార్థంలో వివరించేవే పురాణాలు, జ్యోతిష్యము, నిరుక్తము వంటి వేదాంగాలు.... ఇట్లా చాలా విజ్ఞానం వేదాలలో నిక్షిప్తమైంది. అదంతా అపహరణకు గురికవడంతో బ్రహ్మతో సహా దేవతలందరూ చింతాక్రాంతులై, శ్రీమహావిష్ణువును స్తుతించి, శరణువేడారు. ఆశ్రితవత్సలుడు, శరణాగత ప్రాణోద్ధారకుడు అయిన శ్రీమన్నారయణుడు ఒక మహామీనంగా అవతరించి, సోమ కాసురునితో పోరుసల్పి, వానిని సంహరించి, వేదోద్దరణ గావించాడు. సృష్టి క్రమవికాసం చెంది, విస్తరిల్లేలా బ్రహ్మకు సహకరించేవేదాలు, తిరిగి లభ్యంకావడంతో దేవతలంతా సంతసించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: