1. సహాయం చేసేవారు ఒక్కరైనా లేకపోవటము. 2. కనీస అవసరాలకి ధనము లేకపోవడము. 3. ఒంటి పూట భోజనమును కూడా విపరీతమైన శ్రమ చేయాల్సి రావటము. 4. వినే నాథుడు లేకపోవటము. 5. చినిగిన బట్టలతో ఉండటము. 6. వెళ్లలానికి ఏ వాహనము లేకపోవటము. 7. ధనం ఉన్నా సంతానం లేకపోవటము 8. పుత్రుడు ఉన్నా లేకపోవటము. అలేగే అష్టకష్టాల విషయానికొస్తే ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పనిచేయాల్సి రావటము. భయంకర దారిధ్ర్యము, భార్య ఉండీ ఉపయోగపడకపోవటము, అడుక్కుతినే పరిస్థితి, అప్పు అడిగినా ఇచ్చేవాళ్ళు లేకపోవటము, వీసమెత్తు ఉప్పు కూడా అప్పుగా దొరక్కపోవటము, రెండు కాళ్ళతోనే వెళ్ళాల్సి రావటము, ఇన్ని దరిధ్రాల మధ్యా, అష్టకష్టాల మధ్య కూడా ఎంతో మంది అత్యున్నత స్థాయికి వచ్చారు. ఏ కష్టమూ కలకాలం ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: