ఈ ప్రపంచంలోని అతి కష్టమైన ప్రశ్నల్లో కొన్ని.. అసలు మనిషికి ఏం కావాలి.. మనిషి ఆనందానికి మూలం ఏంటి.. నిత్యం ఆనందంగా ఉండాలంటే మనిషి వద్ద ఉండాల్సిందేంటి.. చూడటానికి సులభంగానే కనిపించినా.. మనిషి జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తే మనిషి సుఖ జీవనానికి మార్గం తెలిసిపోయినట్టే. 

ప్రపంచంలోని మానవుల్లో ఎన్నో వైరుధ్యాలు. జీవన విధానంలో, మతపద్దతుల్లో, ఆహార, వ్యవహారాల్లో ఎన్నో తేడాలు.. కానీ అంతా కోరుకునేది మాత్రం ఆనందమే. ఐతే.. ఈ ఆనందానికి సంబంధించి మనుషుల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది.. ఆరోగ్యంగా ఉంటే చాలు ఆనందం ఉంటుంది. కొన్ని వస్తులువులు ఉంటే ఆనందం ఉంటుంది.. సంతానం ఉంటే ఆనందం ఉంటుంది.. ఇలా కొన్నిస్థిరమైన అభిప్రాయాలుంటాయి. 

కానీ అసలైన ఆనందం ఎక్కడ ఉంటుందన్న ప్రశ్న మాత్రం సమాధానం ఎంత సులభమో.. దాన్ని గుర్తించడం అంత కష్టం. ఆనంద కారణం ఎక్కడో కాదు.. ఏ వస్తువుల్లోనో కాదు.. అది మనలోనే ఉంటుంది అని తెలిసినా దాన్ని గుర్తించలేని అచేతనత, అసహాయత చాలామందిది. ఆనందానికి మనసే మూలం.. మన ఆలోచనా ధోరణే మూలం అన్న విషయం గుర్తిస్తే చాలు సగం ఆనందం దక్కినట్టే.

ఉన్నదాంతో తృప్తిపడటం, నలుగురి సాయం చేయడం, తనను ప్రేమించే వారి ముఖంలో ఆనందం చూసేందుకు ప్రయత్నించడం, వీటన్నింటికీ మించి మనలోకి మనం తొంగి చూసి తాధ్యాత్మికత అనుభవించగలగటం.. ఈ కార్యాలు చేయగలగితే.. మీ ఆనందాన్వేషణ మూడొంతులు పూర్తయినట్టే. అయితే చెప్పినంత సులభం కాదు.. అది సాధన ద్వారానే ఈ అలౌకిక ఆనందం మీ సొంతమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: