చదవులు తల్లి సర్వస్వతీదేవి అని మనకు తెలుసు. బ్రహ్మ అర్థాంగి అయిన ఆమె భక్తితో పూజిస్తే సకల విద్యలను ప్రసాదిస్తుందంటారు. మరి ఆమెను ఎప్పుడు పూజించాలి. ఎలా పూజించాలి.. ఆమె ప్రాశస్త్త్త్యం ఏంటి. ఓసారి తెలుసుకుందాం..  

ఓంకార నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమైందంటారు. ఆ నాదశక్తికి ప్రతిరూపంగా, సరస్వతీ మాట బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తుంటుంది. ఆ మాత మాఘశుద్ధ పంచమి నాడు అంటే శ్రీపంచమినాడు జన్మించిందని చెబుతారు. అందుకే శ్రీ పంచమినాడు విధిగా సరస్వతీదేవిని ఆరాధించాలట. 

శ్రీపంచమి రోజు సరస్వతీదేవిని పుస్తకాలు లేక విగ్రహా రూపంలో ఆవాహన చేసి పూజిస్తే సర్వాభీష్టాలు నెరవేరుతాయట. ఆ రోజు మనుషులే కాదు.. జ్ఞానాభివృద్ధి కోసం దేవతలు కూడా శ్రీ సరస్వతీదేవిని కొలుస్తారట. 

క్షోణితలంబున్ నుదురు సోకక మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి దోయజాతభవచిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామశుక వారిజపుస్తక రమ్యపాణికిన్

అంటే.. 
నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకు, బ్రహ్మదేవుని మనస్సును వశపరచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక, పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీదేవికి, నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను అని అర్థం. 

సరస్వతీపూజాసమయంలో కలశస్థాపన చేసుకోవాలి. సరస్వతీ సూక్తం, సరస్వతి సహస్రనామాలు చదువుకోవాలి. మేథో సూక్తం, సరస్వతీ కవచం, యజ్ఞవాల్క స్తుతి కూడా చదువుకోవచ్చు. విగ్రహరూపంలో కంటే పుస్తక రూపంలో సరస్వతీ పూజ చేసుకోవడం ఉత్తమం. 



మరింత సమాచారం తెలుసుకోండి: