ఈ మధ్య నా టైమ్ ఏమీ బావుండటం లేదు.. అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.. అబ్బా.. చాలా బ్యాడ్ టైమ్ నడుస్తుందండీ. ఏ పని చేసినా కలసి రావడం లేదు. ఏదేమైనా టైమ్ కలసి రావాలి.. ఆ పక్కింటాయనకు చూడు అన్నీ ఎలా సజావుగా సాగిపోతున్నాయో.. ఇలాంటి కామెంట్లు మనం తరచూ వింటూనే ఉంటాం.. నిజంగా అంతా టైమ్ లోనే ఉందా..?

ఒక వ్యక్తికి గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్ అంటూ ఉంటాయా.. కాలం కలసిరానప్పుడు తాడు కూడా పామై కరుస్తుందన్న సామెత నిజమేనా.. ఇలాంటి అనుమానాలు రావడం సహజమే. అవును నిజమే.. కాలం కలసిరావడం రాకపోవడం అంటూ ఉంటాయి. కానీ అవన్నీ అదృష్టం మీద ఆధారపడి ఉండవు.. కాలాన్ని మనం ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటాయి. 

ఎన్ని సంపాదించుకున్నా.. ఎంత ఖర్చు చేసినా తిరిగిరానిది కాలమొక్కటే.. అందుకే ఎలాంటి నష్టాన్నైనా భర్తీ చేసుకోవచ్చు కానీ.. కాలాన్ని వృథా చేయడం వల్ల కలిగిన నష్టాన్ని మాత్రం తిరిగి ఎట్టిపరిస్థితుల్లోనూ రాబట్టుకోలేం. అందుకే కాలం భగవత్ స్వరూపం. ఈ విషయాన్ని స్వయంగా ఆ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పిన విషయం మనం మరచిపోకూడదు. 

అందుకే కాలం విలువ మనిషి తెలుసుకోవాలి. సద్వినియోగం చేయాలి. వ్యసనాలతో కాలాన్ని వృథా చేయకూడదు. మనిషికి కాలం నిజంగానే పరీక్ష పెడుతుంది. వాటిని తట్టుకుని నిలబడిన వాడే మనీషి అవుతాడు. అందుకే టైమ్ ఈజ్ మనీ అని కూడా అన్నారు పాశ్చాత్యులు. అందుకే కాలం విలువ గుర్తించండి. సద్వినియోగం చేసుకోండి. విజయులు కండి. ఆల్ ది బెస్ట్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: