ఆ ముక్కంటి .. రామలింగేశ్వర స్వామిగా కొలువై.. భక్తజన కోటి ప్రదాయుడై శ్రీ రామలక్ష్మణ భరత శతృఘ్నలు ప్రతిష్టించిన లింగాలతో నిత్యపూజలందుకుంటున్న క్షేత్రం ఆవని. ద్రావిడ శైలిలో నిర్మితమై దక్షిణ గయగా సుపరిచితమైన పుణ్యస్థలం.. బెంగుళూరు పట్టణానికి 100 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రమహిమనిత్వం అజరామరం.. ఈ స్థలం పురాణం శతాబ్దాలది.. 10వ శతాబ్దపు నోలాంబ వంశ కాలంలో నిర్మితమైన ఈ క్షేత్రం భక్తజనులకు కొంగుబంగారంగా నిలుస్తోంది..

పురాణ రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి ఈ క్షేత్రంలోనే నివసించినట్లు స్థలపురాణం చెబుతోంది. వాల్మికి ఆశ్రమం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. రావణసంహారం అనంతరం శ్రీ రామచంద్రుడు ఈ ప్రదేశానికి వచ్చినట్లు చరిత్ర గుర్తులు చెబుతున్నయి. సీతమ్మ తల్లి ఈ ప్రాంతంలోనే వనవాసం చేసినట్లు ... లవకుశలు ఇక్కడే జన్మించినట్లు ఆధారాలున్నాయి. సీతమ్మ బట్టలు ఉతికిన ప్రదేశం .. లవకుశలు రాముడితో యుద్దం చేసిన ప్రాంతం.. అక్కడి ఆశ్రమంలో పురిటినొప్పులతో తల్లడిల్లిన సీతమ్మ .. పాండవులు నెలకొల్పిన పంచలింగాలు .. ఇలా ఎన్నో అద్భుతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
 


లవకుశలు పురుడు పోసుకున్న ప్రాంతంలోని మట్టి ప్రసవ వేదనతో బాధపడే మహిళలకు రాస్తే సుఖ ప్రసవం అవుతుందని నానుడి. అంతే కాదు పిల్లలు లేని మహిళలు అక్కడి కోనేటి నీటితో స్నానం చేసి గుట్టపై ఉన్న సీతపార్వతి దేవి ఆలయంలో తడి బట్టలతోనే పూజ చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకం ఉంది.


ప్రస్తుతం భారత ఆర్కియాలజీ సంస్థ సంరక్షణలో ఉన్న ఈ దేవాలయం వాల్మికి ఆశ్రమ పరిసరాలు.. సరైన పర్యవేక్షణ లేక శిథిలాస్థకు చేరుతున్నాయనే అబిప్రాయం కల్గేలా అక్కడి పరిస్థితులు కనిపించాయి. ఇలాంటి ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేస్తే మన ఆలయాలు, చరిత్ర భవిష్యత్తు తరాలకు చెప్పినట్లు అవుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: