ఏదైనా ఒక సాధారణ కార్యక్రమం ప్రారంభించేటప్పుడే కాదు, ఒక పూజ చేసే టప్పుడు కూడా ముందుగా వినాయకున్ని పూజించడం హిందూ సాంప్రదాయం. అలాంటి వినాయకుడ్ని ప్రత్యేకంగా పూజించే రోజు వినాయక చవితి. అందరికీ నచ్చే దైవం. అందరూ కొలిచే దైవం వినాయకుడు. శివ పార్వతుల కుమారుడైన వినాయకుడ్ని పూజిస్తే అందరు దేవుళ్లన్నీ పూజించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి.


హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు అధిపతి వినాయకుడు. విద్యకు, సకల శుభాలకు అధినాయకుడు విఘ్నేశ్వరుడు. అలాంటి శివ పార్వతుల ముద్దుల కుమారుడ్ని వినాయక చవితి నాడు పూజిస్తే ఎంతో ఫలం.


వినాయక చవితి సందర్భంగా వినాయక పూజా వివరాలను, వ్రతకథను వీడియో, పిడిఎఫ్ రూపంలో ఎపిహెరాల్డ్ మీ కోసం అందిస్తుంది.  వినాయక చవితి నాడు లంబోధరుడ్ని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ ఏకదంతుడి అనుగ్రహాన్ని పొందండి.     

మరింత సమాచారం తెలుసుకోండి: