యజ్ఞయాగాదులప్పుడుగానీ, ఏ సత్కర్మలప్పుడు గానీ, దానాలప్పుడుగానీ, చేయించిన వారికీ, చెప్పిన వారికీ దక్షిణ అప్పడే ఆ ప్రదేశంలోనే ఇవ్వాలి. ఆ తర్వాత ఇద్దాములే అని అనుకుంటే విప్రుల పొమ్ము అపహరించిన పాపం కలుగుతుంది. ఆ పాప పరిహారార్థం ఆ తర్వాత పదింతలు ఇస్తే గాని పోదు. దక్షణ ఇవ్వకుపోతే ఎంతటి పూజచేసినా ఫలంరాదు. లక్ష్మీదేవి శపిస్తుంది. అలాగే దానంగా ఇస్తామని చెప్పిన దాన్ని వెనువెంటనే ఇచ్చివేయాలి. దక్షిణ ఉంటేనే ఏ పుణ్యకార్యమైన సత్ ఫలితాన్నిస్తుందని దక్షిణాదేవి వృత్తాంము శెలవిస్తుంది. దేవాలయాల్లో అలాగే పురాణశ్రవణం విన్నవారూ, పండో, ఫలమో ఇవ్వటం గృహస్థుకి శుభం. 

మరింత సమాచారం తెలుసుకోండి: