మనదేశంలో స్వాములకూ, బాబాలకు కొదవలేదు. పంటవదిలి పరిగే కోసం ఎగబడే తత్వం మనది. పరమాత్మను మరిచిపోయి పరివ్రాకులకోసం ఎగబడటమే ఎక్కువ. ఎందుకిలా జరుగుతున్నదంటే, చెప్పగలగిన సమాధానం ఒక్కటే! అతిత్వరగా ధనం సంపాదించాలి. అతిత్వరగా అభివృద్ది సాధించాలి అతిత్వరగా పదవులు పొందాలి. శాంతి, సుఖం, ఆనందం, అభిలాష, అతిత్వరగా పొందగలగాలి. ఎంత అవివేకం ఇది! ఎంత అక్రమం ఇధి! త్వరగా లభించది త్వరగానాశనమై పోతుంది. ఒక్కరోజులో పుట్టే కీటకాలు ఒక్కనాటితోనే మరణిస్తాయి.  అత్యంత వెలుగును ప్రసాందించే మెరుపుతీగ క్షణకాలం మాత్రమే ఉంటుంది. పంది మూడు నెలల్లో పిల్లల్ని కంటుంది. పదిహేను సంవత్సరాలకు మించి జీవించలేదు. కుందేలు నెలరోజులకే పిల్లలు పెడుతుంది. రెండేళ్లకు మించి జీవించదు. అంటే ఆలస్యంగా లభించేది చాలాకాలం ఉంటుంది అని ప్రకృతి మనకు పాఠాలు బెబుతుంది... ప్రజ్ఞావంతులు, ఆత్మజ్ఞానం కలవారు, కర్మయోగులు, తత్వజ్ఞానులు, స్థితప్రజ్ఞులు, బాబాలను స్వాములను ఎన్నటికీ నమ్మరు. దేవునికి దూతలు, రాయబారులు, మధ్యవర్తులు వుండరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: