శ్లో!!పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే నారాయణ ప్రియేదేవి విష్ణువక్షస్థలాలయే క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే పాహిమాం కృపయాదేవి పర్వసంపత్రృదాయనీ!! దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినప్పుడు జన్మించి విష్ణవును వరించిందామె! సర్వలక్షణ సంపన్నులరాలైన ఈ సుందరవతికి ‘‘లక్ష్మి’’ అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు ఆధిదేవతగా చేశారు. దేవతలందరూ! లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూచారు గదా! పాల నురుగు వంటి దేహఛాయ, త్రిలోకైకసౌందర్యం, ఈమెకు స్వంతం! చిరునవ్వు నిండిన ముఖంతో, సర్వాలంకార భూషితయై, గజరాజులు తోడుగా నాలుగుచేతులతో, కమలాసనంపై కూర్చొని వుంటుంది. చేతులలో ఏ ఆయుదాలు వుండవు. కలువపూలను మాత్రమే చేతధరించి వుంటుంది. ఈ ధనాధిదేవత! దేవతలకు నాలుగుచేతులు ఎనిమిది చేతులు వుండటం మనం శిల్పాలలో ఫోటోలలో చూస్తుంటాం. అంటే అంతటి శక్తివుంది అని అర్థం! లక్ష్మికి సరస్వతి(శక్తి)కి ఎనిమిది చేతులు ఉంటాయి. చాలా గొప్పదని అర్థం. ధనలక్ష్మి స్థిరత్వం లేదు. ఒకరి దగ్గర ఒక చోట స్థిరంగా ఉండదు. లక్ష్మిచంచల మనస్సు గలది. స్థిరమైన జీవితంకూడా లేదు. అయితే ఉన్న నాలుగు రోజులు ఉయ్యాల లూగిస్తుంది. అందరినీ అన్నిటినీ దాసోహమనిపిస్తుంది. తనశక్తి ఏమిటో ఎంతటిదో చూపిస్తుంది. అందుకే డబ్బుకు లోకం దాసోహం అంటారు. ‘దనం మూల మిదం జగత్’ అంటారు. లోమికి నాలుగు చేతులుండే కారణం ఇదే! తన చంచలత్వాన్ని అందరికీ తెలియపర్చటానికే శ్రీమహాలక్ష్మి నీటి కొలను ఉన్నతామరలో కూర్చొని ఉంటుంది. నీటిలో ఉన్న కలువపూవు నీటిలో ఉన్నంతసేపే నిగనిగలాడుతుంది. నీటినుండి బయటకు తీయగానే వాడి వతలైపోతుంది. డబ్బుకూడా పెట్టెలో భద్రంగా ఉంటేనే మనిషికి శక్తి ఉంటుంది. బయటకు తీసి ఖర్చుపెట్టేస్తే మనిషికి శక్తి సన్నగిల్లుతుంది. అన్ని విధాలుగా మనిషి క్రుంగిపోతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: