‘అయోనిజ’ అంటే మానవగర్బంలో పుట్టనిది అని అర్థం. పాంచాలరాజైన ద్రుపదడు సంతానం కోసం యజ్ఞం చేస్తుండగా, యజ్ఞంకుండ నుంచి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఆవిర్భవించారు. ఆ కుమారుని పేరు ధృష్టద్యుమ్నుడు, కుమార్తె అసలు పేరు ‘‘కృష్ణ’’ అయినప్పటికీ ఈమె ద్రుపద మహారాజు కుమార్తె కనుక ‘‘ద్రౌపది’’ అయ్యింది. మానవగర్భంలో జన్మించకుండా, యజ్ఞంకుండం (అగ్ని) నుంచి ఆవిర్భవించింది కాబట్టి ద్రౌపదిని ‘‘అయోనిజ’’ అంటారు. ద్రౌపదినే కాకుండా సీత మొదలగు వారిని కూడా అయోనిజలని అంటారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: