మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
  ఈ రాశివారికి గురుడు సంవత్సరమంతా తృతియంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా సప్తమంలో, కేతువు జన్మ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఈ సంవత్సరం మీకు శుభాలు ఆశుబాలు సమానంగా ఉంటాయి ఆర్థికంగా మాత్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది ఆదాయాం బాగుటుంది. వ్యసాయదారులకు గత సంవత్సరం కన్నా మెరుగ్గా ఉంటుంది ప్రణాలికా ప్రకారం వెళ్ళగలిగితే అధిక దిగుబడులు పొందుటకు అవకాశం కలదు. నూతన పనుల విషయంలో కావోచ్చును లేదా చేపట్టిన పనుల విషయాల్లో కావొచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఓపికతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఆదిశగ ఆలోచించుట మేలుచేస్తుంది. చిన్న తరహ పరిశ్రమలు మరియు గృహంలోనే వస్తువులను ఉత్పాదన చేసేవారు తప్పక అభివృద్ధిని కలిగి ఉంటారు ధనలాభంను పొందుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది పోటి పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంది కావున మనోదైర్యంతో ముందుకు వెళ్ళడం తప్పక మేలు చేస్తుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ముందు చూపు అవసరం సరైన ఆలోచనలేకుండా తొందరపాటుతో ఏ పనిచేయకూడదు అలాగే నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మేలుచేస్తుంది. ఉన్నత వర్గాలవారికి అధికాధాయ సంపన్నులకు పెద్దతరహ పరిశ్రమల వర్గాలకు సంభందించిన వారు ఖచ్చితంగా ముందుచూపు చర్యలు చేపట్టడం అన్నివిషయల్లోను నిదానంగా ఆలోచించుట మేలు చేస్తుంది. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు తగిన సమయంగా బావించుట మేలు కొద్దిగా కష్టపడితే తప్పక విజయాలను పొందుతారు మంచి గుర్తింపును కలిగి ఉంటారు. కళారంగాల్లోని వారికి బాగుంటుంది గత ఏడాదికన్నా ఎదుగుదలను పేరును కలిగి ఉంటారు మీయొక్క మాటకు గౌరవం విలువ పెరుగుతాయి సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగులు అలాగే ఇతరంగాలవారు మీ యొక్క ఆలోచనల్లో పరిణతి పొందడం అవసరం అలాగే మీయొక్క అధికారవర్గం తో కాని అలాగే కలిసి పనిచేసే వారితో కలివిడిగా ఉండుట నిదానంగా వ్యహరించుట మంచిది ఇక్కడ మీ శ్రమకు మీరే భాద్యులు ఫలితాలు మీ శ్రమపైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి. గత కొంత కాలంగా పరిష్కారం దొరకని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సమస్యల తాకిడి తగ్గుతుంది. ఖర్చుల విషయంలో తప్పక నియంత్రణ అవసరం అయినప్పటికిని ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు కావున జాగ్రత్త అవసరం. అకారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఊహకందని సమస్యలు ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది కావున ఆలోచన పరిదిని పెంచుకొనుట ఉత్తమం. ఈరాశి భార్యభర్తలు సర్దుబాటు విదానలనుకలిగి ఉండాలి కుటుంభ జీవితంలో భాద్యతలు పెరుగుటకు అవకాశం ఉంది. నూతన గృహ అవకాశాలు కలవు ప్రయత్నం చేయండి. మాసముల వారిగా : ఏప్రిల్ : ఈ మాసంలో అనారోగ్యం విషయంలో తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి. వృత్తి మరియు వ్యాపారములు సామాన్యంగానే సాగుతాయి. కుటుంభంలో ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. అగ్రి మెంట్స్ లాంటివి చేసేటప్పుడు ఆచితూచి వ్యహరించాలి.  మే : ఈ మాసంలో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. మాసం ప్రారభంలో మాములుగా నున్న మధ్యనుంచి అనుకూలంగా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు తప్పక జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా ధనాన్ని ఆడంబరానికి ఖర్చుచేస్తారు. జూన్ : నిరుద్యోగులకు కొంత మేర అనుకూలమైన సమయం గట్టిగా ప్రయత్నం చేయండి. స్థిరాస్తుల విషయంలో మీ ప్రయత్నం ముందుకు సాగుతుంది. శ్రమ ఉన్నప్పటికిని పనులను తెలివితో పూర్తిచేస్తారు. జూలై : విద్యార్థులకు బాగానే ఉంటుంది అనుకున్న పనులు నెరవేరుతాయి. రైతులకు బాగానే ఉంటుంది మిగితా వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాస్థానంలో మార్పునకు అవకాశం కలదు. చేపట్టిన పనులు కొంత నిదానంగానైనా పూర్తిచేస్తారు. ఆగష్టు : కుటుంభంలో స్వల్ప వివాదములు కలుగుటకు ఆస్కారం కలదు. శుభకార్యములలొ పాల్గొనుటకు లేదా నిర్వహించుటకు అవకాశం కలదు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటుతో నిర్ణయాలు కూడదు. సెప్టెంబర్ : ఇతరుల నుండి సహాయం అందకపోవచ్చును. మీ యొక్క వాహనములు ఖర్చులను కలుగజేస్తాయి. బంధువుల నుండి భాదాకరమైన వార్తను వినే అవకాశం కలదు. కొన్ని వ్యతిరేక ఫలితాలు కలుగుటకు ఆస్కారం ఉంది. అక్టోబర్ : అనారోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంభంలో కలుగు వివాదముల విషయంలో సర్దుబాటు విధానం మేలు చేస్తుంది. మీయొక్క మాటలకు మూల్యములు చెల్లించ వలసి వస్తుంది కావున జాగ్రత్త. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నవంబర్ : వృత్తి , ఉద్యోగములలో అకారణంగా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కలదు పెద్దలతో నిదానంగా ఉండటం వారి ఆలోచనలను అమలు చేయుట మంచిది. దాదాపు ఎ పనిచేసినా నిదానంగా ఉండటమనేది సూచన మాసం చివర్లో అనుకూలతలు పెరుగుతాయి. డిసెంబర్ : కుటుంభంలో సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు మంచి మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. ఇతరులకు సంభందించిన విషయాల్లో జోక్యం చేసుకోవడం అలాగే వారికి వాగ్దానములు చేయకపోవడం మంచిది. జనవరి : చేపట్టిన పనులను కొంత ఖర్చు అధికమైన పూర్తిచేస్తారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది పెట్టుబడుల గురించి ఆలోచించుట మేలు. విదేశీయానం అనుకూలంగా ఉంది ప్రయత్నం ముమ్మరం చేయవచ్చును. ఫెబ్రవరి : వృత్తి ఉద్యోగంలో నిదానంగా ఉండటం అలాగే మీయొక్క కుటుంభసభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుట. విద్యార్థులు పట్టుదలతో ఉన్న ఫలితాలు అనుకూలంగా వస్తాయి. వాహనములు నడుపునప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం. మార్చి : బందువులు లేదా మిత్రుల నుండి సహయంలు పొందుటకు అవకాశం కలదు. అధికారుల మూలాన ఒత్తిడి పనిభారం పెరుగుతుంది. పెట్టుబడులు పెద్దగ అనుకూలించవు. పూజలు : ప్రతి రోజు శివస్టోత్తరం చదవడం అలాగే లలితా సహస్రనామం పారాయణ చేయండి ఈ రాశివారు ప్రతి నెల ఏదైనా ఏకాదశి రోజున శివాభిషేకాలు చేయించుకొనుట ప్రతిమాసం అమ్మవారి ఆలయ సందర్శన చేయుట మేలుచేస్తుంది. అలాగే ఏదైనా సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉంది గణపతికి అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు సూర్యున్నిఆరాదించుట అలాగే శ్రీరామున్ని పూజించుట మేలు చేస్తుంది. దానాలు లేదా జపాలు : రాహువు , శని, కేతులకు జపాలు చేయుంచుట అలాగే శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వుట, గురునకు శనగలు దానం చేయుట కేతువుకు ఉలువలు దానం ఇచ్చుట మేలు చేస్తుంది. అదృష్ట సంఖ్యలు :  9, 18, 27. 

మరింత సమాచారం తెలుసుకోండి: