పచ్చని చెట్ల మధ్య, చల్లని వాతావరణంలో ఆహ్లాదంగా కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సపరివారంగా వనం లేదా తోటల్లో ఆనందంగా కలిసిమెలిసి విందు భోజనం చేయడం వెనుక భక్తి ఆథ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకింద విష్ణు భగవానుని పుష్పాలతో పూజిస్తే వాటి సంఖ్యను అనుసరించి అన్ని అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. ఉసిరి చెట్టుకింద లేదా ఆ మొక్క ఉన్నతోటలో మహావిష్ణువు పూజ నిర్వహించి, పంచభక్షాలతో స్వామికి నివేదించి అనంతరం బ్రాహ్మణులకు దానాలిచ్చి బంధుమిత్రుల సపరివారంగా భుజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలలో మహావిష్ణువును కొలిచిన పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం.

మరింత సమాచారం తెలుసుకోండి: