శ్రీరామ నవమి పండుగ రోజులలో దేశమంతటా పచ్చనితోరణాలతో పందిళ్ళతో దీపాల అలంకరణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరారుతుంది. ఈ పండగనాడు పానకం, వడపప్పు, విసనకర్రలు పంచిపెడతారు. ఎర్రని నిప్పులు చెరిగే ఎండాకాలంలో వచ్చే ఈ పండుగనాడు చల్లదానాన్ని కలిగించడం వల్ల జనులు ఎండల వేడినుండి ఉపశాంతి పొందుతారు. పసుపు, కుంకుమలతో అలంకరించి పూజించిన విసన కర్రలను పంచడమనేది మానవత్వాన్ని మేల్పొలుపుతోంది. తియ్యని పానకం తాగుతూ, తియ్యని రామకథా విశేషాలను తెల్సుకుంటూ ప్రజలు ఈ పండగ సమయాల్లో ఆనందంగా గడుపుతారు. శ్రీరామచంద్రున్ని స్మరించే వారికి ఏ చెడు గ్రహముల బాధలూ కలుగవు ఒక నానుడి తెలుపుతున్నది. ‘‘గ్రహబలమేమి? రామానుగ్రహబలముగాని’’ అని కదా రామభక్తుడైన రామదాసు తన కీర్తనలో శ్రీరాముని కరుణను కీర్తించాడు. రామసుధ : - రామనామాన్ని జపించేవారికి భయముండదు. రామనామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం. - రామనామం త్రిమూర్తులకు ప్రతీక. - రామనామం మోక్షదాయకం- మోక్షకారకం. - నిధికన్న- రాముని సన్నిథే మిన్న. - సకల సద్గుణ నిలయుడు శ్రీరాముడు - శ్రీరామ నామస్మరణే ముక్తికి మార్గము.   - మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు. - శ్రీరామ రక్ష- సర్వజగద్రక్ష. - సీతవల్ల భూలోకం పావనమైంది. - రామ సంకీర్తన జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. - మూల్లోకాల్లో రాముని వంటి పురుషోత్తముడు లేడు. - స్త్రీలు ప్రణవము (ఓంకారము) చెప్పేబదులు ‘రామ’ అని రాస్తే సరిపోతుంది. - ప్రతిరోజూ రామనామ జపం చేస్తూ, రాస్తూవుంటే మనశ్శాంతి లభిస్తుంది. - ‘ఓ రామ నీ నామమెంతో రుచిరా’   

మరింత సమాచారం తెలుసుకోండి: