వైశాఖబహుళదశమీ దినమున హనుమజ్జయంతి వస్తుంది. హనుమంతుడు కేవలం శివుని అవతారము. 

అతులితి బలధామం హేమ శైలాభదేహం
దను జవన కృశాం జ్ఞానినామగ్ర గణ్యం
సకల గుణ విధానం వానరాణ మధీశం
రఘపతి ప్రియభక్తం వాత జాతం నమామి!!

శ్రీరామ భక్తాగ్రేసురుడు అతులిత బలధాముడు, ఆపధ్భాంధవుడు, సకలాభీష్ట వరదుడు అయిన హనుమంతుడు వైశాఖ బహుళపంచమి నాడు జన్మించినాడు. భక్తులు ఈ పవిత్రమయిన పర్వదినాన్ని హనుమజ్జయంతిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. హనుమంతుని జననం గురించి వివిధ పురాణాలలో పలురకాలు ఎంతో ప్రీతికరమయిన గాథలు ఉన్నాయి.

ఆంజనేయస్వామికి మంగళ, శని వారాలు ఎంతో ప్రీతికరమయినవి. హనుమజ్జయంతి నాడు ఆయనను తమలపాకులతో అర్చించడం శ్రేష్ఠం.  ఈ రోజున ఉపవాసముండి, వాల్మీకి రామాయణంలోని సుందరకాండ పారాయణం చేసిన భక్తులకు అన్ని రంగాల్లోను ఎనలేని విజయం ధైర్యసహసాలు, సుఖశాంతులు, ధనధాన్యాది సంపదలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: