శరీరమంతా బూడిద, జడలు కట్టిపోయిన తల, చేతిలో మనిషి పుర్రె.. చూసేందుకే భయపడేలా ఉంటారు అఘోరాలు. అసలు అఘోరాల జీవితం ఎలా ఉంటుంది..? వారి ఆహార నియమాలేంటి..? వారికి నిజంగా అద్భుత శక్తులున్నాయా..? ఇవన్నీ ఎంతోమందిని వేధిస్తున్న ప్రశ్నలు.


సాధారణంగా అఘోరాలు ఎక్కువగా కనిపించరు. కుంభమేళాలు, పుష్కరాలు జరిగే సమయంలో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు.. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతారు..? మరి మిగతా రోజుల్లో ఎక్కడుంటారు..? మానవ సంచారానికి దూరంగా నిశ్శబ్ద ప్రాంతాల్లో వీరు నివసిస్తూ ఉంటారు. ఎక్కువగా ధ్యానంలో ఉంటూ.. రాత్రి సమయాల్లో శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేస్తూ కనిపిస్తారు. తమను తాము శివుడితో పోల్చుకునే వారు.. నరమాంసాన్ని ఇష్టపడతారు.. శవాలతో సంభోగం చేస్తారు.


అఘోరాల చేతిలో ఉండే పుర్రెకో ప్రత్యేకత ఉంటుంది. అది కచ్చితంగా మగవారిదే అయి ఉంటుంది. అఘోరాలు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజుల్లో స్మశానంలో క్షుద్రపూజలు చేస్తూ పుర్రెను కళ్లపై భాగం నుంచి కోసి.. దానిని ఒక పాత్రలా చేస్తారు. ఆహారం తిన్నా, యాచించడమైనా అందులోనే చేస్తారు. నీటిని తాగేందుకు మాత్రం కమండలాన్ని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి అద్భుతమైన శక్తులు వస్తాయని వారి నమ్మకం.


అఘోరాలు మామూలు రోజుల్లో ఎవరికీ కనిపించరు. కుంభమేళా, పుష్కరాలు జరిగే సమయాల్లో హిమాలయాల నుంచి వీరు వస్తుంటారు. అయితే అంత దూరం ఎలా ప్రయాణం చేస్తారు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం ప్రయాణించి హఠాత్తుగా మాయమైపోతారు. ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ కనిపించకపోవడానికి కారణం సూక్ష్మశరీర యానం. అదే నానో టెక్నాలజీ. ఇక అఘోరాలకు నిజంగే అద్భుత శక్తులున్నాయా అనేది నేటికీ అంతు చిక్కని ప్రశ్నే. వారికి శక్తులున్నాయని చెప్పుకోవడమే తప్పించి.. ప్రత్యక్షంగా చూసినవారు లేరు.



మరింత సమాచారం తెలుసుకోండి: