ఈ విషయం తెలిసికొనే ముందు నాలుగు వర్ణాల తత్త్వం సంక్షిప్తంగా తెలిసికొనటం అవసరం.

"చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః" అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 4వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిన ప్రకారం బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగ వర్ణాలు ఆయా వ్యక్తుల యొక్క గుణాలను బట్టి, వారు చేసే పనులను బట్టి విభజించబడినవి. అంతే తప్ప ఇందులో ఏ వర్ణమూ కూడా ఒకటి ఎక్కువ, మరొకటి తక్కువ అని చెప్పబడలేదు. ఇవి కాలక్రమంలో మనలోని సంకుచిత స్వార్ధబుద్ధుల కారణంగా దుష్ఫలితాలకు దారితీసాయి. బౌద్ధిక కర్మల కంటే భౌతిక కర్మలను కార్మికుల వలె ఆచరించే శూద్ర విభాగానికి ఈ ఉపనయన సంస్కారం గాని, దీనికి సంబంధించిన నియమాలు కాని అవసరం లేదని దీని భావం. ధీ శక్తి (బుద్ధి శక్తి)కి అధికంగా ప్రాధాన్యతగల కర్మలను ఆచరించే - అనగా సమాజ హితకమైన కార్యక్రమాలు రూప కల్పన చేసి ఆచరింపజేసే బ్రాహ్మణ వర్ణానికి, పర్యవేక్షణ రక్షణాదుల బాధ్యత వహించే క్షత్రియ వర్ణానికి, సమాజ పోషణ, స్థితిగతులకు తోడ్పడే వైశ్య వర్ణానికి ఈ సంస్కార, నియమాలు తప్పనిసరి అని గ్రహించాలి తప్ప ఇక్కడ ఎక్కువ తక్కువ వివక్ష లేదు.

          వేదమంత్రాలపై పట్టు సాధించాలంటే ఎన్నో నియమ నిష్ఠలు, ఆచారాలు పాటించాలి. వేదాధ్యయనానికి గురుకులంలో 12సంవత్సరములు క్రమశిక్షణతో కూడిన బ్రహ్మచర్య దీక్ష అవసరం. కనుక ఉపనయన సంస్కారం తప్పనిసరి. పరంపరాగతమైన వ్యవసాయం, కమ్మరం, కుమ్మరం, చాకలి, మంగలి, మొదలైన కులవృత్తి విద్యలను నేర్వటానికి ఇన్ని నియమ నిష్ఠలు, ఆచారాలు, గురుకులవాసాలు అక్కరలేదు. తల్లిదండ్రుల నుండి లేక కుల పెద్దల నుండి ఈ విద్యలను తక్కువ కాలంలో నేర్వవచ్చు. కనుక ద్విజులు కాని వారికి ఈ ఉపనయన సంస్కారము అవసరం లేదు. ఈ సంస్కారం పొందనందున శూద్రులకు ఏవిధమైన నష్టము కాని, తక్కువతనం కాని లేదు.

          "స్వకర్ణమా తమ భ్యర్చ్య సిద్ధింవిందతిమానవః" అనే గీతా శ్లోకం (18-46) ఇట స్మరణీయము.

          'జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని చెప్పటంలో ఉన్న ఉద్దేశ్యం కూడా పుట్టుకతో అందరూ సమానమే, క్రమంగా, వారి వారి స్వభావాలు, ఆచరణలను బ్టి వారు ఆయా వర్ణస్తులు గా పరిగణింప బడగలరనేది దీని తాత్పర్యం. కటిక వృత్తిని ఆచరిస్తూ కూడా బ్రహ్మజాని అయిన ధర్మ వ్యాధుని కధ, క్షత్రియ కుటుంబంలో (వృత్తిలో) ఉన్నా బ్రాహ్మజ్ఞానులైన జనకమహారాజు, విశ్వామిత్రాదుల కథలు, బ్రాహ్మణ పందతులకు జన్మించినా బ్రహ్మజ్ఞాని కాలేక ఒక మహా పతివ్రత ప్రోత్సాహంతో కటి వాని దగ్గర బ్రహ్మజ్ఞానోదయం పొంది చండకౌశికుని కథ - ఇంలాటివి ఉదాహరణలుగా పురాణాల్లో గమనించవచ్చు. వ్యాస భగవానుడు పురాణేతిహాసాలను సూతకులంలో జన్మించి తన శిష్యుడైన రోమహర్షణునికి, ఇంకా సూతుడని ప్రఖ్యాతిగాంచిన అతని సుతుడగు ఉగ్రశ్రవసునికి అన్ని రహస్యాలతో భోధించాడు. తర్వాత ఈ సూతునికే శౌనకాదిమహర్షులు బ్రహ్మ స్థానాన్నిచ్చి అతని వలన పురాణేతిహాసాలను విన్న సంగతి ఎలా మరచి పోగలము? శూద్రులకు ఉపనయన సంస్కారం అవసరం లేకున్నా జాతకార్మదా సంస్కారాలు జరుపుకోవటం (పురాణోక్తంగా) తప్పనిసరి.


మరింత సమాచారం తెలుసుకోండి: