హిమాలయాల్లో కాంగడా ఘాట్ లలో 'జ్వాలాముఖి' అనే దివ్యస్థానం ఒకటుంది. పృథ్వీగర్భం నుంచి నిరంతరం ప్రకాశవంతంగా ఉండే ఒక మహా జ్యోతి అక్కడ కానవస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుడు - శుభంకరుడు - శంకరుడు ఆ తేజోమయ రూపంలో ప్రకటితమౌతాడు. ఆ పవిత్ర జ్యోతిని దర్శించడానికై భక్తజనులు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు.

          జ్యోకి యొక్క ఈ అద్భుతం అనేక స్థానాలలో కనిపిస్తుంది. ఆ స్థానాల వద్ద దర్శనార్ధం మేళాలు జరుగుతాయి. ఆ స్థానాలు ఇవి:-

          "సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం ||

          ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారేత్వమలేశ్వరమ్ ||

          పరళ్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరమ్ ||

          సేతుబంధేతురామేశం నాగేశం దారుకావనే ||

          వారణఆస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |

          హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ విశాలకే ||"

          మహాదేవుడు అంటే శంకరుడి యొక్క ఈ పన్నెండు జ్యోతిర్లింగాల తేజోమయ, పవిత్ర స్థానాల మహిమ అనుపమానం. అన్ని జ్యోతిర్లింగాల దర్శనానికై భక్తజనులు గుంపులు గుంపులుగా తరలివస్తారు. ప్రాచీనకాలంలో ఈ స్థానాలన్నీ ఆ "జ్వాలాముఖీ" వలె ఉండి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఇక్కడ భవ్యమైన శివమందిరాలు నిర్మించబడ్డాయి.

          సాగరతీరంలో రెండు, నదీ తీరాలలో మూడు, పర్వత శిఖరాలపై నాలుగు మరియు మైదానపు దేశాలలోని గ్రామాల వద్ద మూడు చొప్పున ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు వివిధ రూపాలలో కనిపిస్తాయి. ప్రతి జాగానీ అనేక మంది, అనేక విధాలుగా వర్ణించారు.

          ఈ శుభంకర-శంకర-జ్యోతి-శివస్థానాల దర్శనం వల్ల మన జీవితం పుణ్యమయం, సుఖవంతం, శాంతం, కృతార్ధం అవుతుంది. ఇది మన భక్తి శ్రద్ధలను బట్టి ఉంటుందని అనుభవపూర్వకంగా విదితం అయింది.

          భూమిపై అనేక చోట్ల ముఖ్యలింగాలు అనేకం ఉన్నప్పటికీ, వీటిలో ప్రముఖమైనవి ద్వాదశం-సౌరాష్ట్రంలో సోమనాథ్, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళుడు, వింధ్య ప్రదేశంలో ఓంకారేశ్వరుడు, హిమాలయ శృంగాలపై కేదారం, డాకినీలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, గౌతమీతటంలో త్ర్యంబకేశ్వరుడు, చింతాభూమిలో వైద్యనాథుడు, అయోధ్యవద్ద దారుకావనంలో రామేశుడు మరియు దేవనరోవరంలో ఘృష్ణేశ్వరుడు. ఉదయాన్నే లేచి ద్వాదశ జ్యోతిర్లింగస్మరణవచనం చేస్తే, భవసాగరం నుండి, ఆవాగమన చక్రం నుండి ముక్తి లభిస్తుంది. ఈ లింగాల పూజల వల్ల అన్ని వర్ణాల వారికి దుఃఖ విమోచనం కలుగుతుంది. ఈ లింగాలకు అఱ్పించిన నైవేద్యం తింటే స్వపాపాలు క్షణంలో భస్మం అయిపోతాయి.

          ఒక విధంగా ఇయితే మనం ఈ జ్యోతిర్లింగాలను నిత్యం చూస్తూంటాము. సూర్యుడు, అగ్ని, మరియు దీపజ్యోతి,  ఆ మహాదివ్య జ్యోతి యొక్క రూపాలే. వీటిని చూసే ఆనందం మనకు ప్రతి రోజూ లభిస్తూనే ఉంటుంది.

          "ఓమ్ తత్సర్వితుర్ వరేణ్య" అనే ఈ గాయత్రీ మంత్రంలో బుద్ధికి ప్రేరణ ఇచ్చే సూర్యుడిని సర్వశ్రేష్టమైన తేజోరూపునిగా వర్ణించటమైంది. ఈ మంత్రం జపించటం వల్ల మనిషిలోని ప్రాణజ్యోతి అంటే ఆత్మజ్యోతికి దివ్యశక్తి ప్రాప్తిస్తుంది.

          సూర్యశక్తిలోని తేజస్సు, దాని నుండి లభించే వేడి ఎంత లాభదాయకమో వివరించటం చాలా కష్టం. ఈ అతిభవ్య దివ్యజ్యోతి శక్తివల్లనే ఈ విశ్వంలోని సర్వకార్యకలాపాలూ నిర్వహించబడుతున్నాయి. అట్టి భాస్కరుని జ్యోతికి మేము ప్రణమిల్లుతున్నాం. సూర్యోపాసన చేస్తున్నాం. అర్ఘ్యదానం ఇస్తున్నాం. సూర్యజ్యోతి మాత్రమే ఏకైక సత్యం. అదే నిత్యం. మిగిలినదంతా మిథ్య.

          'అగ్ని' కూడా ఒక మహాజ్యోతి. పృథ్వీతలంలోని సమస్త ధర్మాలు ఈ అగ్నిజ్యోతికి తలవంచుతాయి. నిత్య ఉపాసన చేస్తాయి. అన్ని ఉపయోగాలు, మహత్తు మరియు ప్రయోజనాలు గురించి ఎంత చెప్పినా సరిపోదు.

          సూర్యుడు, అగ్ని యొక్క దీపజ్యోతియే ఈ చిహ్న స్వరూపం. "సా అజ్యేన, వర్తిసంయుక్తం, వనిహానాం యోజితం మయా! దీపం గృహణ దేవేశ త్రైలోక్య తిమిరావహో" ఈ విధంగా ఈ మహాజ్యోతికి వ్రణమిల్లుతున్నాము.

          దీపజ్యోతి యొక్క మహత్తును మనం ఎరుగుదుము. ఆ దీపానికి పూజ చేస్తున్నాము. దీపోత్సవం చేస్తున్నాం. స్వాగత సమారోహాలు, మంగళ కార్యాదులలో దీపజ్యోతితో అగ్రపూజ అందిస్తాము.

          "శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధననంపదా

          శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే"

          ఈ జ్యోతితో మాది, ఇతరులదీ కూడా అంధకారం నశిస్తుంది. అజ్ఞానరూప అంధకారం నశిస్తుంది. స్వధర్మ సూర్యదర్శనం వల్ల మనోవాంఛ పూర్ణమౌతుంది.

          ఈ విధంగా పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం వల్ల, అక్కడి పావన వాయు మండలం మరియు పవిత్రయాత్రల వల్ల సర్వజనులకూ సుఖం, శాంతి మరియు ప్రశాంతత ప్రాప్తిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: