"శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదావసంతమ్ |

          తమర్జునం మల్లికాపూర్వమేనం నమామి సంసార సముద్రసేతుమ్ ||"

           జయమల్లికార్జున! జయమల్లికార్జున!

          ఈ జయఘోషతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కొండలు, పాతాళగంగ పరిసరాలు ప్రతిధ్వనిస్తుంటాయి. ఇక్కడే కదళీ, బిల్వవనాలున్నాయి.

          ఒకానొకప్పుడు ఇక్కడికి శ్రీశంకరుడు వస్తూండేవాడు. ఇదేచోట, ఆయన దివ్య జ్యోతిర్లింగ రూపంలో  నివసించనారంభించాడు. దీనిని కైలాస నివాసం అని అంటారు.

          కార్తికే. కుమారుడు భూమిచుట్టూ ప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాక నారదుడి నుంచి గణఏశుడి వివాహ వృత్తాంతం విన్నాడు. అతడికి కోపం వచ్చింది. తల్లితండ్రులు వారిస్తున్నా వినక వారికి నమస్కరించి క్రౌంచ పర్వతానికి వెళ్లిపోయాడు. పార్వతి ధుఃఖితురాలైంది. ఎంత ధైర్యం చెప్పినా.. సంభాళించుకోలేక పోయింది. అప్పుడు శంకరుడు దేవర్షులను కుమారుని బ్రతిమిలాడటానికై పంపాడు. కాని నిష్ప్రయోజమైంది. దాంతో పుత్రవియోగ వ్యాకుల అయిన పార్వతి కోరికపై, ఆమెతో కలిసి శివుడు స్వయంగా అక్కడికి చేరుకున్నాడు. కానీ తల్లితండ్రుల రాకను గురించి ముందుగానే తెలుసుకున్న కుమారుడు క్రౌంచ పర్వతాన్ని వదిలి మూడు యోజనాల ధూరానికి వెళ్ళిపోయాడు. వెతుక్కుంటూ ఇతర పర్వతాలకు వెళ్లేముందుగా, తమది ఒక జ్యోతిని అక్కడ స్థాపించారు. ఆనాటి నుండి మల్లికార్జున క్షేత్రంగా ఆ జ్యోతిర్లింగం మల్లికార్జునడని పిలువబడుతోంది. అమావాస్యనాడు శివుడూ, పార్ణమినాడు పార్వతీ, నేటికీ అక్కడి వస్తారు అని భక్తుల నమ్మకం. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా, ధన్యవాద వృద్ధితో  బాట, ప్రతిష్ట, ఆరోగ్యం మరియు ఇతర మనోరథాలు ఈడేరుతాయి.

          ఒకసారి అర్జునుడు తీర్ధయాత్రలు చేస్తూ, ఈ కదళీవనానికి వచ్చాడు. అర్జునుని ధనుర్విద్యను పరీక్షించుటకై శంకరుడు ఒక భిల్లుని రూపంలో వచ్చాడు. ఇద్దరూ ఒకే అడవి పందిని వేటాడసాగారు. ఇద్దరి బాణాలు పందికి తగిలాయి. దాంతో ఇద్దరూ దానిపై తమదే హక్కని యుద్ధం ఆరంభించారు. ఈ యుద్ధంలో అర్జునుడు గెలిచాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఈ యుద్ధాన్ని కితార్జునీయ యుద్ధం అంటారు.

          చంద్రావతి అే రాకుమార్తె వన నివాసియై ఈ కదళీవనంలో తపస్సు చేస్తుండేది. ఒక రోజున ఆమె ఒక అద్భుతాన్ని చూసింది. కపిల అనే ఆవు ఒక బిల్వ వృక్షం క్రింద నిలబడి తన నాలుగు పొదుగుల నుండీ పాలధారను కురిపించసాగింది. ఇలా నిత్యమూ చేస్తుండేది. చంద్రావతి ఆ స్థానంలో త్రవ్వి చూడగా.. అక్కడ ఆశ్చర్యం కలిగిస్తూ ఒక స్వయంభు శివలింగం కనపడింది. శంకర భగవానుని ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని చంద్రావతి ఆరాధించింది. ఆమె అక్కడ అతి విశాలమైన శివమందిరం నిర్మించింది.  శంకరుడు ప్రసన్నుడైనాడు. చంద్రావతి వాయుయానంలో కూర్చుని కైలాసం చేరుకుంది. ఆమెకు మోక్షం లభించింది. గుడిలోని ఒక శిలా ఫలకంపై చంద్రావతి కథ చెక్కబడి ఉంది.

          శైల మల్లికార్జునుని ఈ పవిత్ర స్థానానికి చేరువగా కృష్ణానది పాతాళగంగా దర్శనం ఇస్తుంది. లక్షలాది భక్తగణాలు ఇక్కడ పవిత్ర స్నానంగావించుకుని జ్యోతిర్లింగ దర్శనార్ధం వెడతారు.

          కర్ణాటక రాష్ట్రానికై యుద్ధం చేస్తున్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాత్రి జ్యోతిర్లింగ దర్శనం చేసుకునేందుకు వచ్చాడు. అప్పుడు గుడి యొక్క కుడివైపు ఒక గోపురం నిర్మించాడు. ఒక అన్నశాలను కూడా తెరిచాడు.

          విజయనగర రాజులు కూడా ఇక్కడ గుడులు, గోపురాలు, వసారాలు, మండువాలూ, చెరువులూ నిర్మించారు. శివభక్తురాలయిన అహిల్యాబాయి హోల్కర్ ఇక్కడి పాతాళగంగపై 852మెట్లు గల స్నాన ఘట్టం నిర్మించింది.

          శైలపర్వతపు ఈ ప్రదేశం మొదట దుర్గమంగా, కష్టంగా, ప్రమాదభరితంగా ఉండేది. అయినా నిష్ఠాబలంతో వేలకొద్దీ భక్తులు ఇక్కడికి చేరుకునేవారు. హిరణ్యకశివుడు నారదుడు, పాండవులు, శ్రీరాముడు వంటి పురాణపురుషులు ఇక్కడి జ్యోతిర్లింగాన్ని దర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: