కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము. దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు.

 

శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు.

 

భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలని సేవించి గోతులో దాచిన స్థలము ఇదె. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయే శ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు.

 

గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నానా బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుకబడిన వారు చదువులో మరియు ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము.

 

గురు గ్రహ దోషాలు వున్నవారు ఆలం గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.


మరింత సమాచారం తెలుసుకోండి: