కావేరీనదిని దక్షిణ గంగ అని పిలుస్తారు. సహ్యపర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్లోని బ్రహ్మగిరి కొండపై కావేరి ఆవిర్భవించింది. కొడుగు లేదా కూర్గు అనే ప్రాంతం ఈనదికి రూపకల్పన చేస్తుంది. కావున ఈ నది ‘‘కూర్గుకువూరి’’ అని కావేరి ఉద్భవించే ప్రదేశాన్ని తలక్కాలేరా అని అంటారు. కావేరీ పుట్టెచోట ఒకచిన్న తొట్టె ఆకారంలో ఉంటుంది. ఈతలక్కామేరీలో కావేరీమాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా భక్తులు పిలుస్తారు. భక్తుల కోర్కెతీర్చే ఇలవేల్పుగా కావేరీ దేవత పేరు పొందినది. ఈ దేవతకు ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.


దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు ముఖ్యమైన ఉపనదులు చెప్పబడుతున్నాయి. ఇవికాక కనక, సుజోజ్యోతి, హేమావతి, లోకాపాము, అర్ఖావతి, తొప్పైయ్యేరు శరభంగ, మణిమధుర, హాళే, సాగరఘాటె, లక్ష్మణతీర్థ, కాబినికుండల, అమరావతి మొదలగు చిన్నపెద్ద మొత్తం కలిసి 50కిపైగా కావేరికి ఉపనదులు ఉన్నాయి. వీటివల్ల కావేరివెడల్పు పెరిగి ప్రవహిస్తుంది. 


కావేరి పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం. అందుకే కావేరీని ‘‘పొన్ని’’ అని అంటారు. పొన్ని అంటే ధాన్యం అని బంగారు అని రెండు అర్థాలు. ఈ నది ధాన్యసమృద్ధి కలిగించేది, బంగారు పంటలు పండిచేదని ఈ కావేరినదికి పేరు.కూర్గుకొండల్లో జన్మించి కొంతదూరం పర్వతసీమలందే ప్రవహించి తర్వాత ఆగ్నేయదిశగా ప్రవహించి మైసూరు రాష్ట్రంలో పీఠభూమి దశవదిలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రంవద్ద దూకుతుంది. ఇక్కడ కావేరి రెండుగా చీలుతుంది. ఈ రెండు చీలకల పేర్లు పరుచుక్కి, గగనచుక్కి అని పిలుస్తారు. పరచుక్కి 230 అడుగులు క్రిందకి ఒక జలపాతంలా పడుతుంది.
 గగనచుక్కి అద్భుతంగా 90 కి.మీ. కొండచరియల్లోకిపడి కావేరీనదీ అలసటలేకుండా ప్రవహిస్తుంది. శివసముద్రం దాటిన తర్వాత కావేరి తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి, తంజావూరు జిల్లాలో అధికశాతం ప్రవహించి కావేరి అక్కడనుండి మరికొంతదూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.


స్నానయోగ్యమైన కావేరి నదీతీర పుణ్యక్షేత్రాలు.చిదంబరం అతిప్రాచీన దేవాలయం, శివుడు ప్రళయతాండవం చేస్తున్న అతిపెద్ద విగ్రహం. నాలుగుదిక్కులు నాలుగు రాజగోపురాలు నటరాజస్వామి ఆలయంలో ఆలయంలోని నృత్యమందిరంలో ఎన్నో నృత్యభంగిమలు వందలకొలది వున్నాయి. వెయ్యి స్తంభాల మంటపం అత్యుద్భుతంగావుంది. ఈక్షేత్రం పంచలింగాల్లో ఒక్కటైన ఆకాశలింగము ఉంది. ఈ క్షేత్రం తంజావూరుకు 106 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రం కావేరినది ఒడ్డునవుంది.


శ్రీరంగం  : 
ఈ క్షేత్రములో రంగనాధులు, రంగనాయకలు ప్రదానదేవతలు. ధనుర్మాసంలో గొప్పగా ఉత్సవాలు జరుగుతాయి.
ఈ క్షేత్రంలో 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో, 24 మంటపాలతోపాటు వేయిస్తంభాల మంటపం కల్గిన అతిపెద్ద వైష్ణవక్షేత్రం.
ఈ క్షేత్రాన్ని మద్రాసు బెంగుళూరు నుండి రైలుమార్గాలు కలవు. ఈక్షేత్రం తిరుచినాపల్లి (తిరుచ్చి) ప్రక్కన కావేరి నది ఒడ్డున కలదు.
తంజావూరు  చోళరాజులునిర్మించారు. ఇక్కడ స్వామి బృహదీశ్వరేశ్వరుడు. అమ్మవారు బృహన్మాక, గర్భాలయం 81 టన్నుల గొప్ప శిలలతో నిర్మితమైనది. శ్రీరంగం క్షేత్రమునకు సుమారుగా 90 కి.మీ దూరం ఈ క్షేత్రం కలదు. కుంభకోణం  ఈ ప్రాంత చోళరాజులు పరిపాలించిన ప్రదేశం. ఈక్షేత్రంలో ప్రసిద్ధిమైన 4 విష్ణాలయములు, 12 శివాలయములు వున్నది. కుంభకోణ క్షేత్రమంతా దేవాలయాల సముదాయమే. ఈ క్షేత్రం తంజావూరునుండి 38 కి.మీ. దూరంలో ఉన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: