శృంగారమే పరమావధి గా దేవుడి పేరు చెప్పుకుని తానొక దైవాంస సంభూతుడిని అంటూ రచ్చ చేసి ఇప్పుడు జైలు లో చిప్పకూడు తింటున్నాడు గుర్మీత్ సింగ్. ఇప్పుడు ఇతని లాగానే బాబా శివరాం దాస్ ఉదంతం బయట పడింది.


ఒక టీనేజీ బాలిక ఇచ్చిన ఫిర్యాదు తో ఉత్తర పదేశ్ పోలీసులు మొత్తం నిఘా వేసి అత్తన్ని అరస్ట్ చేసారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం శివరాం దాస్ ఆమెని దాదాపు ఎనిమిది నెలల పాటు బందించి పెట్టుకుని అత్యాచారం చేసాడు.


తన అనుచరులతో కూడా ఆమెని సామూహికంగా అత్యాచారం చేయించేవాడు. యాభైవేల కి బాబా కి తన కుటుంబం తనని అమ్మేసింది అని అప్పటి నుంచీ తనని లక్నో లోని ఆశ్రమం లో బందించారు అని ఆమె చెప్పుకొచ్చారు.


ఆపై ఆగ్రాకు తీసుకెళ్లి, అక్కడా ఆమెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. తన నగ్న దృశ్యాలను వీడియో తీసి బయటకు చెబితే వాటిని బట్టబయలు చేసి పరువు తీస్తానని బెదిరింపులకు గురి చేశాడు. ఆశ్రమంలోని చిన్న పిల్లలను రాజకీయ నాయకులు, అధికారుల వద్దకు పంపుతుండేవాడు. స్వయంగా ఓ బాలికల పాఠశాలను నడుపుతూ, బాబా సెక్స్ రాకెట్ ను నిర్వహించాడు. ఈ దొంగ బాబా మీద సీతాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆరోపణలపై విచారణ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: