కశ్యపుడు అదితలకు జన్మించిన వాడే సూర్యుడు. ఈయననే ఆదిత్యుడు అనికూడ అంటారు.దేవదూత అయిన అదితి కోరిక మేరకు సూర్యుడు ఆమె గర్బమున‌ జన్మించినాడు. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలువబడినాడు.

Related image

సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు.ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరం అంటారు.ఈ రథము నందు పండ్రెండు మాసములు,ఆరు ఋతుఇ,నాలుగు- నాలుగు మాసముల చొప్పున మూడు నాభులు ఉంటాయి.  ఇదియే కాలచక్రమని కూడా అంటారు.
కాబట్టి సూర్యభగవానుడు  పన్నెండు మాసములలో 12 పేర్లతో ఆరాందించబడతాడు.
Image result for sun god
1) చైత్రమాసంలో- ధాతా
2) వైశాఖమాసములో- ఆర్యముడు
3) జేష్టమాసములో - మిత్రుడు
4) ఆశాడమాసములో - వరుణుడు
5) శ్రావణమాసములో- ఇంద్రుడు
6) భాద్రపదమాసంలో - వివస్వంతుడు
7) ఆశ్వీజమాసంలో - పూషా
8) కార్తీకమాసంలో- పర్జన్యుడు ( విశ్వావసుపు)
9) మార్గశిరమాసములో-  అంశుమంతుడు
10) పుష్యమాసములో- భగ
11) మాఘమాసములో- త్వష్టా
12) పాల్గునమాసములో - విష్ణు


అని సూర్యభగవానుని పన్నెండు రూపాలను వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసలలో ఆరూపాలలో పూజిస్తుంటారు.
👉 ఇందుకు సంబందించిన చక్కటి విశేషాలు సూర్యభగవానుడి గ్రందములో దొరకును.


మరింత సమాచారం తెలుసుకోండి: