ఈ నెల 31 వ తేదీన రాబోవు చంద్ర గ్రహణం గురించి పూర్తి వివరణ/ అవగాహన . జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం  ఖగోళ పరంగా చంద్ర గ్రహణం అనేది సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సూర్యుడు, భూమి ఎప్పటికి ఒకే మార్గంలో ఉన్నప్పటికి చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు అటూ ఇటూగా తిరిగుతుంటాడు.

Image result for jaya guru datta

సూర్య,చంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్దగాని,కేతువు వద్దగాని ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమనీ,కొంత భాగమే కనిపించకపోయేదాన్ని పాక్షిక చంద్రగ్రహణము అని అంటారు.

Image result for jaya guru datta

జనవరి 31న చంద్రగ్రహణం
ఈ నెల 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.
చంద్రగ్రహణం వేళలు ఇవీ...
సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం
సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం
రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు
రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )
గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.
సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం "76"నిమిషాలు.
ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది...
చంద్ర గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా ,యూరప్ ఈశాన్యప్రాంతం.ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,పసిఫిక్ మహాసముద్రం,హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.
గ్రహణ గోచారం ఇలా...
ఈ గ్రహణం కర్కాటకరాశిలో ఏర్పడటం మరియు ఆ రాశి నుండి సప్తమ దృష్టి పరంగా మకరరాశి అవటం చేత ఈ రెండు రాశులవారు మరియు పుష్యమి,ఆశ్లేష,మఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది.కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుంది.
ఏ రాశివారిపై ఏ ప్రభావం
ధనస్సు-మేషం-కర్కాటక-సింహ రాశుల వారికి అధమ ఫలం.
వృశ్చిక-మకర-మీన-మిధున రాశుల వారికి మధ్యఫలం.
కన్య-తుల-కుంభ-వృషభ రాశుల వారికి శుభ ఫలములను పొందుతారు.
గ్రహణం ఎవరికైనా గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుందdi.
చంద్రగ్రహణ నిబంధనలు ఇవీ..
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు యదావిధిగా మల,మూత్ర విసర్జన చేయవచ్చు.నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి.దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి.
ఆ వేళలో ఆహార పానీయ నియమాలు
అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు,జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి.అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు,పెద్దలు చెబుతుంటారు.
శాస్త్రీయ పద్ధతి అవసరం
గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి , జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు,తర్వాత పట్టు,విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భవవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలోఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లల్లు,గర్భినిలు, అనారోగ్యంతో ఉన్నావారు చేయకూడదు. చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.
తర్వాత ఇలా చేయాలి.
గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి,విగ్రహాలు,యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.జంద్యం(గాయత్రి)వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.ఇంటిముందు,వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాలలు,కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా (గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి. మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు,పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర,బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి,పెదలకు ఏదేని ఆహర,వస్త్ర,వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు,గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది
మీకు పునర్జన్మ వద్దా, ఏం చేయాలంటే...
సృష్టిలో మానవుడు సహజంగా అన్ని జీవరాసులలాగే పుట్టినప్పటికిని,భగవత్ ఆరాధన విషయంలో మాత్రం మానవునికి భక్తికి పై మెట్టు జ్ఞానం అవుతుంది.భక్తి, జ్ఞానం అనేది ఒకటి కాదు.మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం.మన కున్న కోరికలను భగవంతుడు తీరిస్తే మనల్ని దేవుడు కరునించాడని సంబరపడిపోతుంటాం.
కోరికలు తీరకుంటే నా ఖర్మ బాగాలేదు అనుకుని బాధపడతాం.మానవునుకి భక్తి భావం అనే విషయం నిజంగా చాలా గొప్పది.మనిషిలో భక్తిభావం కలిగింది అంటే మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నట్టే లెక్క. కేవలం భగవంతుడిని కొలవడానికే ఆ భక్తి పరిమితం కాకూడదు. భగవత్ ఆరాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్న విశిష్టత తెలుసుకోలేము. దైవం యొక్క మహిమను గ్రహించలేము. భక్తి ముక్తిదాయకమైనది అయితే దానికి పైనున్న మెట్టే జ్ఞానం.ఆత్మజ్ఞానం సాధించిన మనిషి ఋషి అవుతాడు.
ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కాదు. మనగురించి మనం తెలుసుకోవడమే! మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్ళించుకోవటమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపలావణ్యాలను మాత్రమే కాక ఆయనచుట్టూ అలముకున్న దివ్యత్వాన్ని గ్రహించాలి.
ఆ దివ్యత్వంలో ఉపదేశాలు, ప్రబోధాలు కూడా భాగమై ఉంటాయి. వాటిని గ్రహించాలి. ఆ ఉపదేశాలలో ఆచరణయోగ్యమైన వాటిని ఆచరించాలి. ఆ ప్రబోధాలలోని నీతిని గ్రహించాలి. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మోక్షదాయకమవుతుంది.
అలా కాకుండా జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించక అజ్ఞానంతో బ్రతికితే మోక్షం సిద్ధించదు.నరుడే నారాయణుడు అని భావించి సాటి వారికి తన వంతుగా సహయపడాలి.అలా కాకుండా కేవలం స్వార్ధబుద్ధితో,బందు ప్రీతితో వ్యవహరిస్తే తిరిగి నీచమైన జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే ఏ ఆత్మ అయినా మనిషిరూపంలో జన్మిస్తుంది. ఆ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గాన్ని ఎంచుకోవడం మానవుల సత్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
భగవంతుడు సృష్టించిన జీవజాలమేదీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి.భగవంతుని గుర్తించినవాడు కేవలం మానవుడు ఒక్కడే. అందుకే ఈ మానవ జన్మ అత్యంత ఉత్తమమైనది.మనిషి తనకున్న జ్ఞానంతో వివేకంతో మసలుకొని భగవంతుని కీర్తనలు గానం చేస్తుంటే భగవంతుడు పరవశం చెంది,ఆ భక్తునికి వశుడవుతాడు. ఆధ్యాత్మికమార్గంలో పయనించడానికి సరైన గురువును ఎంచుకోవాలి.
శిష్యుడు గురువు చూపిన మార్గంలో నడవ గలగాలి. గురువు చెప్పిన నీతి సూత్రాలు ఆచరించాలి. ఈ ఆచరణలో ఉన్న సమయంలో ఎలాంటి సండేహాలు పనికిరావు. భగవంతుని మీద ఎటువంటి భక్తి శ్రద్ధలు చూపుతామో, ఆధ్యాత్మిక గురువు దగ్గర అదే భక్తిని ప్రదర్శించాలి.
అప్పుడే భగవదనుగ్రహం సులభతరమవుతుంది.మోక్షం సిద్ధిస్తుంది.గురువు చూపిన మార్గంలో శిష్యుడు తూచా తప్పకుండా ఆచరించిన నాడు ఆశిష్యునుకి సంపూర్ణ గురు కటాక్షం కలిగి మోక్షం సిద్ధిస్తుంది.అందుకే అంటారు గురువే దైవం,సర్వస్వం,గురు మహిమ అనిర్వచనీయమైనది,మహిమాన్వీతమైనది


మరింత సమాచారం తెలుసుకోండి: