యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామ శివారులో మల్లన్నబోడులు గుట్టల్లో రెండు రోజుల కిందట రామాలయం బయటపడింది. రాతిగుండుపై సీతారాముల అర్థశిల్పం చెక్కి ఉండగా, ఇది దేశంలోనే రెండో అరుదైనదిగా పురావస్తు పరిశీలకులు చెబ్తున్నారు. మల్లన్నబోడులు పక్కనే వ్యవసాయం చేస్తున్న పల్లెపాటి మల్లేశ్ పశువులు తప్పిపోగా, వాటిని వెతుక్కుంటూ గుట్టపైకి వెళ్లిన ఆయనకు ఈ ఆలయం కనిపించింది. ఇది ప్రచారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
Related image
యాదాద్రి దేవస్థానం ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు తదితర అర్చక బృందం ఆలయాన్ని సందర్శించి, విగ్రహాలు రాములవారివని తేల్చడంతో చుట్టుపక్కల గ్రామాల్లో సందడి నెలకొంది. కేసీఆర్ చొరువతో యాదాద్రి ఇప్పుడిప్పుడే తెలంగాణకు తలమాణికంగా రూపుదిద్దుకుంటూ ఆధ్యాత్మిక నగరిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరో రామాలయం వెలుగులోకి రావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి కారంపూడి ప్రసాదాచార్యులును అర్చకులుగా నియమించి, నిత్యపూజలు చేయిస్తున్నారు. ఈ ఆలయాన్ని బుధవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్ సారథ్యంలో శిల్పాల ప్రతిమలను పరిశీలించారు.

భద్రాచలం కన్నా పురాతనమైనది...


భద్రాచల రాముని శిల్పం 17వ శతాబ్దం నాటిది కాగా, ఇక్కడి శాసనాల్లో కన్పిస్తున్న లిపిని బట్టి ఇవి 16వ శతాబ్దకాలం నాటిదని తెలుస్తున్నది. ఈ రాములోరి విగ్రహానికి నాలుగు చేతులు, ముందరి కుడిచేయి అభయహస్తంగా, బోటనవేలు, చూపుడు వేళ్ల మధ్య బాణంతో వుంది. ముందరి ఎడమ చేయి ఎడమ భుజం మీద ఉన్న విల్లును పట్టుకున్నట్టుగా చెక్కి ఉంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ఉన్నాయి. ఫ్రలంభాసనంలో కూర్చున్న రాముని ఎడమ తొడపై సీతాదేవి కూర్చుని ఉండగా, ఇటువంటి శిల్పం ఒక్క భద్రాచలంలోనే ఉంది. గుడి లోపల కూడా పానవట్టం ఉంది.

ఈ దేవాలయానికి రక్షణగా ప్రకృతి సహజంగా ఉన్న రాతిగుండ్లే కాక చిన్న ద్వారం, ఒక రాతిగోడ కట్టి ఉన్నాయి. గుడికి ఉత్తరాన ఉన్న చిన్న రాతిగుండు మీద చెక్కిన రెండు వరుసల లేఖనం ఉంది. 5 అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కి ఉండడంతో, పూర్తిగా విగ్రహంగా చెక్కబడి భద్రాచల రాముని శిల్పం కన్నా ఈ విగ్రహమే ముందుదని తెలుస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: