మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు – ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు. గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. ఇప్పుడు ఏలిన్నాటి శని దోషం ఉన్న వారు ముఖ్యంగా దీన్ని పఠిస్తే ప్రయోజనం ఉంటుందని పండితుల ఉవాచ!


Image result for shani devudu images


శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.


Image result for sanigrah hd image



సూర్యపుత్రో దీర్ఘదేహః!  విశాలక్ష శ్శివప్రియ:! మందచార: ప్రసన్నాత్మా! పీడాం దహతు మే శని:!!

శన్యారిష్టే తు సంప్రాప్తే!  శనిపూజాంచ కారయేత్శ!  నిధ్యానం ప్రవక్ష్యామి!  ప్రాణి పీడోపశాంతయ!!

నీలాంజన సమాభాసం!  రవిపుత్రం యమాగ్రజం!  చాయా మార్తాండ సంభూతం!  తన్నమామి శనైశ్చరం!!

నమస్తే కోణ సంస్థాయ! పింగళాయ నమోస్తుతే! నమస్తే బభ్రు రూపాయ! కృష్ణాయచ నమోస్తుతే

మనస్తే రౌద్ర దేహాయ! నమస్తే చాంతకాయచ! నమస్తే యమ సంజ్ఞాయ! నమస్తే సౌరాయే విభో!!

నమస్తే మంద సంజ్ఞాయ! శనైశ్చర నమోస్తు!  ప్రసాదం మమదేవేశ!  దీనస్య ప్ర్రణతస్యచ!!


Related image


ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః


పైన వివరించిన శని మంత్ర బీజాక్షరాలను ధ్యానం సహితంగా (ఆదివారం నుండి శనివారం వరకు విభజించుకొని) 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: