వైవస్వత మన్వంతరములో ఐదవ మహయుగము నందు ముప్పై వేల సంవత్సరములు మిగిలి ఉండగా త్రేతాయుగము నందు"విళంబినామ" సంవత్సర మేషరాశి యందు రవి సంక్రమణ జరుగగా చైత్ర శుక్ల నవమి బుధవారము పునర్వసు నక్షత్రం 4వ పాదము నందు మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో 5 గ్రహములు ఉచ్ఛస్థితిలో ఉండగా శ్రీరాముడు జనియించాడు.

Image result for sri ramanavami

 అప్పుడు అశ్వనీ నక్షత్రము 3వ పాదము మేషరాశిలో అనగా రవి ఉచ్ఛస్థితి, పునర్వసు 4వ పాదములో కర్కాటక రాశి స్వస్థానం నందు చంద్రుడు, శ్రవణా నక్షత్రం 3వ పాదము నందు అనగా మకరము నందు కుజుడు ఉచ్ఛస్థితిలో, ఉత్తరాభాద్ర 3వ పాదములో మీనంలో బుధుడు నీచ స్థితి, పుష్యమి నక్షత్రం మొదటి పాదము కర్కాటక రాశిలో గురుడు ఉచ్ఛస్థితి చంద్రునితో కూడి ఉండగా, రేవతీ 4వ పాదము నందు శుక్రుడు మీనరాశిలో ఉచ్ఛస్థితిలో ఉండగా, స్వాతి నక్షత్రం 4వ పాదము తులలో శని ఉచ్ఛస్థితిలో ఉండగా, పూర్వఫల్గుణి నక్షత్రం 4వ పాదము సింహరాశి లో రాహువు, పూర్వాభాద్ర 2వ పాదము కుంభం లో కేతువు ఉండగా రాముడు జన్మించాడు. 

Related image

 రాముడు పునర్వసు 4వ పాదములో జన్మించాడు కనుక గురు దశలో 4సంవత్సరములు మిగిలినవి తదుపరి శనిదశలో బుధాంతర్థశ నందు అనగా పరాభవ నామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి నాడు శ్రీరామునికి ఉపనయనము,  శనిలో శుక్ర అంతర్దశ లో అనగా 12వ సంవత్సర ము నందు కీలక నామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పూర్ణిమ ఉత్తరఫల్గుణీ నక్షత్రము నందు భూమి నుండి జన్మించిన సీతాదేవి తో వివాహం తదనంతరం 12సంవత్సరములు అయోధ్య లో సుఖజీవనం తదుపరి రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుక్ల పంచమి నీచ స్థితి ఉన్న బుధదశ నందు వనవాస ప్రారంభం అవుతుంది.
Related image
సీతాపహరణం ధాత నామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి, రావణ సంహారం ఫాల్గుణ బహుళ అమావాస్య, విభీషణ పట్టాభిషేకం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ తదియ, అయోధ్యకు పుష్పక విమానం లో బయలు దేరుట ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి, భరద్వాజ ఆశ్రమం లో బస ఈశ్వరనామ సంవత్సర చైత్ర శుక్ల పంచమి, నంది గ్రామంలో భరతుని కలుసుకొని అయోధ్య నగర ప్రవేశం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల షష్ఠి, శ్రీరామ చంద్ర పట్టాభిషేక మహోత్సవం ఈశ్వర నామ సంవత్సర చైత్ర శుక్ల సప్తమి పుష్యమి నక్షత్రం నందు పట్టాభిషేకం.
Image result for sri rama navami kalyanam
ఈ విధంగా 9,974 సంవత్సరాల 10 నెలలు సీతా దేవితో నివాసం తదుపరి 1025 సంవత్సరాల 2 నెలలు సీతా వియోగం తదుపరి సీతాదేవితో వైకుంఠ ప్రవేశం. 

పై విషయములు బ్రహ్మాండ పురాణం నుంచి సేకరించి శ్రీరామచంద్రమూర్తికి సభక్తికంగా సమర్పణ చేసినవారు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి దేవస్థానం, పున్నమ్మతోట,  విజయవాడ-10, ఆలయ అర్చక స్వామి కోసూరి విజయ సారధి.


మరింత సమాచారం తెలుసుకోండి: