అక్షయ అంటే తరగనిది, క్షయం లేనిది అని అర్థం. మహాభారతంల్లో అక్షయపాత్ర పేరు ప్రస్తావనకు వస్తుంది. ఈ పాత్ర ఉన్నవారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.  అష్టైశ్వర్యాలకు అధినేత్రి శ్రీమహాలక్ష్మీ. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.  భారత దేశంలో పండగలకు, వివాహాది శుభకార్యాలకు బంగారం విరివిగా కొంటారు. అయితే ఇలాంటి సందర్భమే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అదే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ అనేది భారతీయుల సెంటిమెంట్..ఆ రోజు బంగారం కొంటే సకల సంపదలు తమ వెంట ఉంటాయని అంటారు. అంతే కాదు ఆరోజు బంగారం షాపులు కిట కిటలాడుతుంటాయి.

Image result for అక్షయ తృతీయ apherald

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

Image result for అక్షయ తృతీయ apherald

 "వైశాఖ శుక్ల పక్షేతు తృతీయా రోహిణి యుతా,
దుర్లభా బుధచారేణ సోమనాపి యుతా తథా"

Image result for maha laxmi

"అక్షయ తృతీయ" అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే "తృతీయ" తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 Image result for maha laxmi
హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్య చంద్రులిరువురూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజజు ఇది. ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని , ఈ రోజు మొత్తం శుభకరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసిన పనిలేదని హిందువులు నమ్ముతారు. కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈ రోజు పిల్లర్ పని మొదలుపెట్టుకోవడం , నూతన వ్యాపారానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం , వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.

Image result for ఉపవాసం

ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానం లో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహం పై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: