Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Aug 16, 2018 | Last Updated 11:24 am IST

Menu &Sections

Search

మనిషి ప్రధాన శత్రువులు ఆరుగురు - వీటిని వదిలించు కోవటానికి ఏ దైవాన్ని పూజించాలి?

మనిషి ప్రధాన శత్రువులు ఆరుగురు - వీటిని వదిలించు కోవటానికి ఏ దైవాన్ని పూజించాలి?
మనిషి ప్రధాన శత్రువులు ఆరుగురు - వీటిని వదిలించు కోవటానికి ఏ దైవాన్ని పూజించాలి?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మనిషి ప్రవర్తనలో ఈ మద్య వచ్చిన అనేక ప్రతికూల మార్పులు గమనిస్తే అతని మనసులో పెరిగిపోతున్న "కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు" మాత్రమే కారణం. ఈ ఆరు దుర్లక్షణాలను "అరిషడ్వర్గాలు" గా పిలుస్తారు. దీని విస్త్రుత అర్ధం ఏమంటే అరి (శత్రువు) షడ్ (ఆరు) వర్గాలు (రకాలు) మనసును ఆలోచనలను ప్రభావితం చెసే ఆరు శత్రు విభాగాలు లేదా లక్షణాలు అని చెప్పొచ్చు.

arishadvargaalu

ఈ మనిషిని ప్రేరేపించే ప్రతికూల అరిషడ్వర్గాలు మనిషిని ఎంతటి నీచ స్థాయికైనా దిగజారు స్తాయి. ఇవి మనిషి పతనానికే కాదు, ప్రకృతి వినాశనానికి దోహదం చెసే ప్రధాన అంశాలు.


1.కామం– కామం అంటే కోరిక లేదా వాంచ ఇది కావాలి, అది కావాలి అని మనిషి పడే తాపత్రయానికి ప్రధాన ఆధార ప్రతికూల లక్షణం. అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం. అంతే తాను జీవిస్తే,సుఖిస్తే చాలు అని కాకుండా, తన తరతరాలు ఊహలకు మించిన కోరికలు తీర్చుకోవాలన్న అభిలాష అన్నమాత. 

arishadvargaalu

ఈ మద్య మగువలపై లైంగిక దౌర్జన్యాలు, అరాచక్లాలు, అవినీతి, అక్రమాలకు, కుల, మత, వర్గ, ప్రాంత, లింగ విభేదాలకు కామమే కారణం. ఈ కామంతో రగిలిపోయేవాళ్ళకు సిగ్గు బిడియం భయం ఉండవంటారు.

arishadvargaalu

"కామాతురాణాం న భయం న లజ్జ" అంటే అర్ధమదే. కామం సర్వానర్ధాలకు మూలం.   


2.క్రోధం – క్రోధం అంటే కోపం, ఆగ్రహం. కోరుకున్న కోరికలు తీరనదుకు కారణాలు తనలోని "కామం" అని గుర్తించకుండా మనసు చింతిస్తుంది. అంతే కాదు తన వాంచలు తీరక పోవడానికి కారణం వెతికి అందుకు ఇతరులు అడ్డుపడటమేనని భావించి వారిపై ప్రతీకారేచ్చ పెంచుకొని రగిలిపోతూ కక్ష పెంచుకొని పగ  తీర్చుకోవాలనే ఉద్రేక పూరిత నిర్ణయాలు తీసుకుంటుంది.

క్రోధాన్ని అగ్ని తో పోలుస్తారు. ఇది ఉంటే మనిషిని మనసును ప్రకృతిని దహించివేస్తుంది కనుక.

arishadvargaalu

3. లోభం – కామ పూరిత వాంచలతో తాను సంపాదించుకున్నదేదైనా, సాధించుకున్నదేదైనా, పూర్తిగా తన స్వంతమని తానే పూర్తిగా అనుభవించాలని  భావించడం "లోభం". తన స్వంత మనుకున్నదాంట్లో నుండి పూచిక పుల్ల కూడా పరులెవరికీ దాన, ధర్మాలు చేయకుండా ఉండ టమే లోభం.

ఇది ఒక రకంగా పిసినారి తనం. తను ఎవరికి పంచక తాను అనుభవించక పోవటామే లోభి లక్షణం. సంపద ఏదైనా అనుభవించటానికే కదా!

arishadvargaalu

4. మోహం- కామం ద్వారా సంపాదించినదాన్ని లోభం ద్వారా నిలబెట్టుకొని సాధించుకున్న సంపద ఖచ్చితంగా తనకే...తనకే కావాలి అనుకొని దానిపై విపరీత వ్యాయామం అంటే ప్రతికూల ప్రేమ పెంచుకొనటాన్నే "మోహం" అంటారు. దాన్ని ఇతరులకు పంచని అతి వ్యామోహం గుణం మోహం అన్నమాట.

arishadvargaalu

5. మదం – మదం అంటే అహంకారం పొగరు. తాను మోహం పెంచుకొని తాను స్వంతం చేసుకొని సంపద పెంచుకొని  తాను కోరుకున్నవన్నీ నెరవేరితే అదంతా తన గొప్పతనమేనని గర్వించడం. ఇతరులకు ఆ సామర్ధ్యం లేదని వారిని పలచన చేసి చిన్నచూపు చూడటం చివరకు గుర్తించకపోవటం కూడా మదం కిందే లెక్క.

arishadvargaalu

6. మాత్సర్యం - తనకున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు కూడా దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఉంటే- అది ఇతరులకు కూడా దక్కకూడదని, తనకు ఇష్టమైనది తనకు దక్కని పరిస్థితుల్లో నైనా ఇతరులకు దక్క కూడని భావించే గుణం "మాత్సర్యం" దీన్నే ఈర్ష్య అసూయ అని కూడా అంటారు.


arishadvargaalu

ఈ ఆరు దుర్లక్షణాలు ఉండే వారి మనసులో ఎల్లప్పుడు స్వార్థం, సంకుచిత భావాలే ఉంటాయి. ఇవన్నీ దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. కామం కారణంగా ఇన్ని దుర్లక్షణాలు మనిషి మనసులో పేరుకొని మనిషి అత్యంత స్వార్ధపరుడుగా మారిపోయి వారు తమకు తామే కాకుండా సమాజానికి కూడా శత్రువుగా మారిపోతాడు.


అరిషడ్వర్గ పీడితులంతా నేడు మన శాసననిర్మాణసభల్లో, అధికారవ్యవస్థలో, న్యాయవ్యవస్థలో, చివరకు సమాచారమందించే మీడియా మొత్తం వ్యాపించారు. సమాచార వ్యవస్థ సహితం ఒక్కొక్కరు ఒక్కొక్క రాజకీయ వర్గానికి కొమ్ము కాస్తూ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. 


ఈ అరిషడ్వర్గాలను మనం మన మనసును అదుపులో ఉంచుకొంటేనే తప్ప అనుకున్న స్థాయికి చేరలేం. లేకపోతే వీటి పాశాల్లో చిక్కుకొని పతనమయ్యే పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలంటే మన మనసును అదుపులో ఉంచడం అవసరం అదే అరిషడ్వర్గాలను ఖండించగల బలమైన ఆయుధం.

arishadvargaalu

ఇవన్నీ నిమిత్త మాత్రాలని భగవంతుని పై విశ్వాసమే దివ్యజ్ఞానం ఇస్తుందని నమ్మి ఆ పరమాత్ముని గురించి జ్ఞానాన్ని, ఆత్మ ఆద్యాత్మిక ఙ్జానాన్నిఎల్లప్పుడూ తెలుసుకుంటూ జీవనం గడిపితే అరిషడ్వర్గాలన్నీ మన మనసు నుంచి బయటకు వెళ్ళిపోతాయి.


ఈ అరిషడ్వర్గాలన్నీ ప్రతినాయకుని (విలన్) లక్షణాలుగా చెప్పొచ్చు.


అరిషడ్వర్గాలను గుర్తించి ఆ మోహ పాశాలను వదలలేని వారు దైవ ప్రార్ధనతోనైనా వదిలించుకోవాలని చూస్తారు. దీనికి "కాలభైరవ అష్టకం" పఠిస్తే పలితం ఉంటుందని కొందరు పండితోత్తములు వచిస్తూ ఉంటారు. పాఠకుల కోసం కాలభైరవ అష్టకం పొందుపరచటం జరిగింది.  

arishadvargaalu


"కాలభైరవ అష్టకం"

arishadvargaalu

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం, వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |
నారదాది యోగిబృంద వందితం దిగంబరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం, నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |
కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||

శూలటంక పాశదండ పాణిమాది కారణం, శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|
భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం, భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం, కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|
స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం, నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం, దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|
అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం, కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం, కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం, జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం, తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||
||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్||

 

 


arishadvargaalu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author