దాదాపు ప్రతి మతంలో ఈ ఉపవాసం అనే భావన ఉన్నది. ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగిలిన మతాలలో చేసేదానికన్నా భిన్నమైనది. రంజాన్ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు, వారి జీవితకాలంలో మానవులు చుట్టూ చెడ్డశక్తుల నుండి దూరంగా ఉండటం కూడా. రంజాన్ ఉపవాస దీక్ష ఒక నెల పాటు దీర్ఘంగా కొనసాగుతుంది.ఇస్లాం మతంలో చేసే ఉపవాసం మిగిలిన మతాలలో చేసేదానికన్నా భిన్నమైనది. రంజాన్ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదు, వారి జీవితకాలంలో మానవులు చుట్టూ చెడ్డశక్తుల నుండి దూరంగా ఉండటం కూడా. రంజాన్ 
ఉపవాస దీక్ష ఒక నెల పాటు దీర్ఘంగా కొనసాగుతుంది.
Related image
రమజాన్‌ మాసం ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. నిగ్రహం, భక్తి, ధర్మనిష్ట, పాపభీతి, పరామర్శించడం, దయ, కరుణ, ప్రేమానురాగాలు, ఉపకారం, మేలు కోరడం, మానవ సేవ, దైవమార్గంలో స్థిరంగా ఉండటం, ఐక్యత, ఉత్సాహం అల్లాహ్, మహాప్రవక్త(స) తో అత్యంత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే మాసం.  ఈ మాసంలో ఉపవాసాలు విధిగా చేయబడ్డాయి. బదర్‌ యుద్ధం ఈ నెలలోనే 
జరిగింది. షబె ఖదర్‌ను ఉంచబడిరది... మక్కా విజయ సంఘటన కూడా ఈ నెలలోనే జరిగింది. ఈ నెలలోని ప్రతి పది రోజులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడిరది. ఇంకా ఈ నెలలో జకాత్‌, దానధర్మాలు, ఫిత్రాలతో ధాతృత్వం వెల్లివిరుస్తోంది.
Image result for ramadan 2018
కావున పవిత్ర రమజాన్‌ నెల ప్రార్థనల ఔన్నత్యాన్ని ఎంతో పెంచబడినది. రమజాన్‌ రాకపూర్వమే ప్రతి ముస్లిం అంతః, భాహ్యపరంగా సంసిద్ధులౌతారు. అంతః, బాహ్య పరమైన పరిశుభ్రతను చేసుకోవడం కోసం, భక్తి, ధర్మనిష్ట, నిగ్రహం సాధించడం కోసం అత్యంత కార్యసాధనంగా సహాయ పడేదే ‘ఉపవాసం’. రంజాన్ ఉపవాసాలు 30 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది చంద్రుడు మొదలు చూసిన దగ్గర నుండి పై నెల చంద్రుడిని చూసిన తరువాత ముగుస్తుంది. 
Related image
రంజాన్ నెలలో, ఒక వ్యక్తి రోజు ప్రారంభం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్షలో ఉంటాడు. కేవలం ప్రార్థనలు తరువాత అతను, ఆమె ఆహార మొదటి ముద్ద ఆహారాన్ని తీసుకుంటారు.ఈ నెలలోని రాత్రుల్లో తరావీహ్ నమాజును చదవడం నఫిల్‌గా భావిస్తారు. ఎవరైనా ఈ నెలలో ఒక గొప్ప పుణ్యకార్యం చేస్తే అది రమజానేతర నెలలో ఫరజ్‌ చేసినంత పుణ్యంగా భావిస్తారు.  ఈనెల సహనం, ఓపిక గల నెల. సహనం ప్రతిఫలం స్వర్గం, ఈనెల సమాజంలోని పేద, అవసరాలు గల వారికి ఆర్థికంగా ఆదుకొనే నెల. ఈ ప్రార్థనలన్నిటినీ ప్రతి ముస్లిం విధిగా పాటించాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: