పాకిస్థాన్ ఆటగాళ్లకి ఐసీసీ స్ట్రాంగ్  వార్నింగ్ ఇచ్చింది...ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి సంభందించిన అవినీతి నిరోధక శాఖ పాకిస్థాన్ ఆటగాళ్ళు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది మైదానంలో పాక్ ఆటగాళ్ళు యాపిల్ స్మార్ట్ వాచ్ లు తీసుకుని రాకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఈ విషాన్ని పాక్ ఆటగాడు హసన్ అలీ ధ్రువీకరించాడు..వివరాలలోకి వెళ్తే..

 Image result for icc warning to pakistan cricketers

పాక్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోంది అయితే గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు కొందరు ఆటగాళ్లు యాపిల్ వాచి ధరించి ఆడినట్టు ఐసీసీ అవినీతి నిరోధకశాఖ విభాగానికి చెందిన ఓ అధికారి గుర్తించారు.. దాంతో ఆయన వెంటనే పాక్ మేనేజ్మెంట్వెం.. ఆదేశాలు జారీ చేస్తూ ఇకపై ఆటగాళ్లు ఎవరూ మైదానంలో స్మార్ట్ వాచ్‌లు ధరించరాదని అల్టిమేటం జారీ చేశారు..

 Related image

.అయితే  వాస్తవానికి  ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మైదానంలోకి అనుమతించరు...అయితే ఆటగాళ్ళు మైదానానికి చేరుకున్న తరువాత ఫోన్లతోపాటు ఇతర వస్తువులను అక్కడికి సిబ్బందికి ఇచ్చేయాల్సి ఉంటుంది..ఎందుకంటే  ఇటువంటి వాచీలను పెట్టుకోవడం వల్ల ఆటగాళ్లను బుకీలు సంప్రదించే అవకాశం ఉండటంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందనే అభిప్రాయం ఉంటుందని అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఐసీసీ వర్గాలు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: