ముస్లీంల పవిత్ర పండగలో ఒకటి బక్రీద్.  త్యాగానికి ప్రతీకైన బక్రీద్  పండగను ముస్లీంలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు.  దీనికి ఆ పేరు రావడం గురించి ఒక కథ చెబుతారు. 5 వేల ఏళ్ల క్రితం నాటి ఇరాక్ లో జరిగిందని చెపుక్కునే ఒక మహత్తు పూర్వకమైన సంఘటన ఆధారంగా ఈ పద్దతి ఏర్పడింది అని భావిస్తారు. ఇరాక సామ్రాజ్యంలో దైవ వాక్కులను ప్రజలకు అందిస్తూ.. న్యాయం, ధర్మ సూత్రాలు వల్లె వేస్తూ.. మూఢ నమ్మకా లపై, అజ్ఞాన ఆచారాలపై చైతన్య పరుస్తున్న హజ్రత్‌ ఇబ్రహీం అనే భక్తిపరుడు వుండేవాడు.

అతను దేవుడు ఒక్కడేనని... ఆతన్ని నమ్ముకున్న వారికి ఎలాంటి హానీ కలగదని ప్రచా రం చేస్తు.. జనాన్ని ఆకట్టుకుంటాడు.  ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న నమ్రూద్‌ నిరంకుశుడు. దైవం ఒక్కడే అంటూ ఇబ్రహీం చేస్తున్న ప్రచారం సమ్రూద్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.. తక్షణం తన సామ్రాజ్యాన్ని వీడి వెళ్లి పోవాలంటూ హజ్రత్‌కు రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు. ఇరాక నుండి బైటకు వచ్చిన హజ్రత్‌కి మార్గంలో అనేక మంది అనేక దేవతల్ని పూజించడం కనిపిస్తుంది.

తానే ఇన్నాళ్లు పొరపాటు పడ్డానే వెూ అని భావించిన ఆయన మదిలో నిజంగా దైవం అనేది ఉందా ఉంటే వీళ్లంతా పూజిస్తున్నట్లు అనేక రూపాలలో ఉందా ఇంత మంది దేవుళ్లు ఉన్నారా అన్న ప్రశ్న మదిని దొలిచి ఆ దిశగా దైవం ఎక్కడ అనే సత్యాన్వేషణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఓ రోజు ఆతనికి కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరాడట.

నిద్రనుండి మేలొన్న ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్ కు ఈ సంగతి తెలియజేశాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ అందుకు  ‘సరే’ అన్నాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ఈ పండుగను బక్రీద్ అని పిలవటం జరిగింది. (బక్రా అనగా గొర్రె) అలా ఈ పండుగ పేరు బక్రీద్ గా పేర్కొంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: