ముస్లీంల పవిత్ర పండగ ‘రంజాన్’ తర్వాత మరో ముఖ్యమైన పండగ బక్రీద్.  త్యాగానికి ప్రతీకైన బక్రీద్  పండగను ముస్లీంలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు.  బక్రీద్‌ను ‘ఈద్ ఉల్ జుహా’ అని కూడా అంటారు.  ఈ పండుగ రోజున ముస్లీం సోదరులు ఈద్  గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం అల్లాకు మేకను బలిగా ఇస్తారు. నెమరు వేసే జంతువులను మాత్రమే బలి ఇస్తారు.
Image result for బక్రీద్
అంటే ఒంటె, మేక, గొర్రె, ఎద్దు ఆవులాంటి జంతువుల్ని మాత్రమే బలిస్తారు. దీన్నే ‘ఖుర్బానీ’ అంటారు.ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు.
Image result for బక్రీద్
ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: