ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా చేసుకున్న పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ అనే చెప్పొచ్చు.  ఈ పండుగలో ముస్లిం సోదరులు తన స్థాయికి తగ్గట్టు మాంసాహారం పంచి పండుగ చేస్తారు.  భగవంతుని కావాల్సిం ది సిరి సంపదలు కాదని... మనిషిలోని సంకల్స శుద్ది ఎంత గొప్పదో తెలుసుకు నేందుకు దైవం పెట్టే పరీక్షలు మనిషికి కష్టమే అయినా... ఓర్పితో వాటిని భరించాలి. దైవ ప్రసన్నతే ధ్యేయంగా జీవనాన్ని కొన సాగిస్తూ మనోవాంఛలని త్యాగం చేయాలన్నది అల్లా ఆదేశాలను తాను అమలు చేసానని ఇబ్రహీం పేర్కొన్నాడని... ఆతని బాటలో ముస్లింలం తా నడవాలన్నదే ఈ పండుగ ఉద్దేశ్యం అని ముస్లిం పెద్దలు చెప్తారు.
Image result for muslim bakrid
బక్రీద్ రోజుకు ముందురోజున చనిపోయినటువంటివారి గోరీలవద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులను ఉంచుతారు. వారు స్వర్గంనుండి వచ్చి వాటిని భుజిస్తారని, స్వీకరిస్తారని, స్వీకరించి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ. మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు.
Related image
ఈ యాత్రనే హజ్ యాత్ర అని అంటారు. హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.


హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం  తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమైన భక్తిపూర్వక సందర్భాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: