భారతీయులు ఎంతో విశ్వాసంతో ప్రధమ దేవుడిగా మహాగణేషుడిని పూజిస్తారు.  ప్రతిసంవత్సరం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవింగా చేస్తారు.  వినాయకుడిని నవరాత్రులు పూజించి సాగరంలో నిమజ్జనం చేస్తారు.  అయితే  మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం 'కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు.


అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: