వినాయకుడి రూపం ఓంకారం. సకల దేవతలతోపాటు త్రిమూర్తుల తేజస్సు సంతరించుకున్న దేవుడు గణనాథుడు. గణపతిని పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే. గజవదనుడు పత్రి పూజను స్వీకరిస్తాడు. పత్రితో పూజ చేయడమంటే ప్రకృతిని ఆరాధించడమే. వర్షా కాలంలో వచ్చే సర్వ రోగాలు ప్రతాల వాసనతో నయమతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే  ఆది దేవుడిని ఆకులతో పూజిస్తారు.


ఆకులు, అలములు సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు లంబోదరుడు. పాలు, మీగడ, పంచదార, తేనే, పండ్లు, కూరగాయాలు, చెరకు గడలు.. ఇలా ప్రకృతి సిద్ధమైన పూజా సామాగ్రితో ఆరాధనలు అందుకుంటాడు విఘ్ననాథుడు. కుడుములు, ఉండ్రాళ్లు,  పానకం, వడపప్పు, కొబ్బరి... బొజ్జ నిండా తిని భక్తులందరికీ సులువుగా చేరువవుతాడు. భగవంతుడైన గణపతికి ఉండ్రాళ్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.

Image result for వినాయకుడికి ఉండ్రాళ్ళు

ఆయన ప్రతిరూపంలోనూ ఒక పాత్రలో ఉండ్రాళ్లతో కన్పిస్తారు. అవంటే అంత ఇష్టం కాబట్టి ఆయనకి జరిగే ఏ పూజలోనూ ఉండ్రాళ్ళు నైవేద్యం లేకుండా ఆ పూజ పూర్తవ్వదు. లడ్డూలు కూడా పెట్టినా ఉండ్రాళ్ళంటేనే గణపతికి ఎక్కువ ఇష్టం.  

Why Lord Ganesha Likes Modaka

ఉండ్రాళ్ళు తయరీ విధానం :

వినాయకచవితి పండుగ రోజు గణపతికి పెట్టే ప్రసాదాల్లో ముఖ్యంగా ముందు వరుసలో ఉండేది ఉండ్రాళ్లు. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా...

కావలసిన పదార్దాలు:

* బియ్యం రవ్వ - 1 కప్పు

* నూనె - 2 చెంచాలు

* జీలకర్ర - 1/2 స్పూన్

* ఉప్పు - 1/2 స్పూన్

* సెనగపప్పు - 3 స్పూన్స్

* నీళ్ళు - 2 కప్పులు

తయారీ విధానం:

బియ్యంరవ్వను.... (మిక్సిలో బియ్యం ఆడించి.. వచ్చిన రవ్వను జల్లించి..పైన వచ్చిన రవ్వను) ఉండ్రాళ్ళకు వాడతారు.

ముందుగా దళసరి గిన్నె తీసుకుని 1 కప్పు రవ్వఅయితే... 2 కప్పుల నీళ్ళు గిన్నెలో పోసి...సెనగపప్పు వేసి జీలకర్రతో పాటు 2 స్పూన్స్ నూనె కలపాలి. బాగా మరుగుతున్న నీటిలో రవ్వ కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి. పూర్తిగా రవ్వ పోసికలిపి మూత పెట్టాలి. అలా సిమ్ లో 5 నుంచి పదినిమిషాలలోపు ఉంచితే రవ్వ పలుకు లేకుండా ఉడుకుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మగ్గాక వెడల్పు పళ్ళెం లేక బేసినలోకి ఈ రవ్వను తీసి చల్లారనిచ్చి తడి చేతికి కొద్దిగా నేయి రాసుకుని ఉండలుగా చుట్టాలి...అంతే ఉండ్రాళ్ళు 


మరింత సమాచారం తెలుసుకోండి: