శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"

ఈ శ్లోకంలో వినాయక తత్త్వం దాగుందని మీకు తెలుసా? శుక్లాంబరదరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు అనే ధావళ్యత సత్త్వగుణ ప్రతీక.'శుక్లాంబరధరం విష్ణుం' అంటే సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించినవాడని. శశివర్ణం అంటే చంద్రునివలె కాలస్వరూపుడని. అంటే లోక పాలకుడని. 'చతుర్భుజం' అంటే ధర్మార్ధకామమోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్దబ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నది సకల గణాధిపతి అయిన వినాయకుడే అని పై శ్లోకంలో దాగున్న తత్వ్తం.


వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని పూజకు కావలసిన సామగ్రిని సమకూర్చుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగురవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.  వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి తోరణం కట్టుకోవాలి.

Image result for గణేషుడి నైవేద్యం

దేవుని గది వుంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని వుంచాలి. తెచ్చిన పూడా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి.  సమస్త జీవజాతులకు గణేషుడే ఈశ్వరుడు. గణపతిని పూజిస్తే విఘ్నాలు, ఆటంకాలు దూరమవుతాయని అంటోంది పద్మపురాణం. జ్ఞాత్వ - కుర్విత - కర్మాండ్.. అనేది ఉపనిషత్తు. గణం అంటే సమూహం. ఇంద్రియాల సమూహానికి అధిపతి మనస్సు. ఏ పని నెరవేరాలన్నా తొలుత మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. అంటే నాయకున్ని స్థిరంగా మనస్సులో నిలుపుకోవాలి.

Image result for వినాయక పూజ

మనస్సును స్వామిపై నిలిపి వినాయకుడిని 16 నామాలతో పూజించే భక్తులకు విద్యారంభం, వివాహం, ప్రయాణం, ఇతర కార్యాల్లో విజయం తప్పక లభిస్తుంది. భాద్రపద శుద్ధచవితి వినాయక చవితి. దీనినే గణేశ చతుర్థి, శివ చతుర్థి అని అంటారు. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టిపాత్రను వుంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. అక్షతలు, పూలువేసి దానిపై మామిడి ఆకులు వుంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి.


ఆ తర్వాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నియమ ప్రకారం పూజ, దీపారాధన, నైవేద్యాలు సమర్పించుకోవాలి.పత్రి పూజతో వినాయకుడి అనుగ్రహం పొందండి. 21 పత్రాలతో పూజ చేయడం ద్వారా నేత్ర, మూత్ర, చర్మ సంబంధిత రోగాలు దూరమవుతాయి.  వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: