భారత దేశంలో ఎంతో భక్తి శ్రద్దలతో కొలిచే దైవం గణేషుడికి ముఖ్యమైన వాహనంగా ఎలుక ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే మొదట వినాయక విగ్రహాలలో ఈ వాహనాన్ని చూపించలేదని అంటారు కొంత మంది పురాణ పండితులు. అయితే వినాయకుని ఎనిమిది అవతారాలు ఉన్నాయని చెబుతారు..వక్రతుండ, ఏకదంత, మహుదర, గజవక్త్ర,లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అవతారాలు..ఈ ఎనిమిది అవతాలకు ఐదు అవతారాల్లో ఎలుకు వాహనంగా ఉంది..వక్రతుండ వాహనం సింహం, వికట అవతారం వాహనం నెమలి, విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. 
Image result for విఘ్నేశ్వరుడు ఎనిమిది అవతారాలు
వినాయక పురాణంలో నాలుగు అవతరాలు ప్రస్తావించబడినాయి. అందులో మహూటక అవతారం వాహనం సింహం.  మయూరేశ్వర అవతారం నెమలి. ధూమ్రకేతు అవతారం గుర్రం.  గజాననుని అవతారి ఎలుక.    అయితే జైనుల సాంప్రదాయంలో గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాల్లో చూపించబడ్డాయి. లిఖిత గ్రంథాలలో మత్స్య పురణాణంలో మొదటి సారిగా ఎలుక వాహనం గురించి లిఖించబడింది. 
Related image
 ఆ తర్వాత బ్రహ్మండ పురాణం, గణేశ పురాణం లలో ఈ విషయం ఉంది. చివరి అవతారం లో ఎలుకను వాహనంగా చేసుకున్నట్లు గణేశపురాణంలో ఉంది.  గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం ధ్వజం మీద ఎలుకు ఉంటుంది.  గణపతి సహస్రనామాల్లో ‘మూషిక వాహన’, ‘అఖుకేతన’ అనే పేర్లు పేర్కొనబడ్డాయి. 


ఎలుక వాహనం సంకేతాన్ని అనే విధాలుగా వివరిస్తారు. ఎలుక తమస ప్రవృత్తిక చిహ్నం, కనుక కామ క్రోధాలను అణగదొక్కడం అనగా ఎలుకపై స్వారీ చేయడం.   పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ.  ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి. ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్లగలడు అందుకే ఆయనను సర్వాంతర్యామి అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: