విఘ్నేశ్వరుడు ఎనిమిది అవతారాలు దాల్చినట్లు ముద్గల పురాణం చెబుతోంది. అందులో ... చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. పురాణాల్లో, మంత్రశాస్త్రాల్లో ఎన్నో వినాయకమూర్తులు ఉన్నాయి. వాటిని ఉపాసించే పద్ధతులూ అనేకం. గణపతి అవతారాలను కొన్ని పురాణాలు చక్కగా ఆవిష్కరించాయి. ఆ అవతారాల పేర్లను, గాథలను గమనిస్తే ఎంతో చక్కని అద్భుతమైన తత్వాలు గోచరిస్తాయి. 

Image result for వినాయకుడి అవతారాలు

 

1. వక్రతుండావతారం: ‘మత్సరా’సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల ‘శరీరతత్వం’లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. ‘దేహబ్రహ్మధారకుడు’ అని పురాణం పేర్కొంది.

2. ఏకదంతావతారం: ‘మదా’సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో ‘జీవ’ (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.

3. మహోదరావతారం: ‘మోహాసురు’ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. ‘జ్ఞాన’చైతన్యానికి అధిపతి.

4. గజాననావతారం: సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. ‘లోభా’సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.

5. లంబోదరావతారం: ‘క్రోధాసురుని మర్దించిన అవతారం. ‘శక్తి’ బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. ‘దేవీతత్వ’ స్వరూపం- గణపతి అని పురాణ భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.

6. వికటావతారం: ‘కామా’సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. ‘సూర్యబ్రహ్మ’గా సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.

7. విఘ్నరాజావతారం: ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. ‘మమతా’సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని ‘విష్ణుబ్రహ్మ’గా విష్ణుతత్వంగా చెబుతారు.

8. ధూమ్రవర్ణావతారం: ‘అభిమానాసురు’ని సంహరించిన ఈ అవతారం మూషిక వాహనంపై శోభిల్లుతున్నది. ‘శివ’రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: