నాయకుడికి బెల్లం అంటే ఇష్టం. పసుపు వినాయకుడికి బెల్లం, అరటిపళ్ళు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టాలి.వాటి మీద నీళ్ళు జల్లుతూ ఈ కింది మంత్రం చదవాలి. పిల్లలు, పెద్దలూ అందరూ ఎంతో ఇష్టపడే, భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగ వినాయకచవితి. ఈ పండుగ రోజున వినాయకుడికి ఇష్టమైన కుడుములు, లడ్లు, పాల తాలికల వంటివెన్నో నైవేద్యం పెడతారు.   విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది.

Image result for బెల్లం తాలికలు

వివిధ ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు, ఉండ్రాళ్ళలో తాలికలు ఒకటి. ఉండ్రాళ్ళుతో పాటు తాలికలు కూడా చాలా ఇష్టం. గణపతి విఘ్నాలను తొలగిస్తాడు. ఉండ్రాళ్ళు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. బొజ్జగణపయ్య చాలా ఇష్టంగా ఆరగించే ఉండ్రాళ్ళను , తాలికలను భక్తితో వండి నైవేద్యం సమర్పిస్తే ఆయన సంత్రుప్తి చెందుతాడు. మనల్ని చల్లగా కాపాడుతాడు. కాబట్టి మన బొజ్జగణపయ్యకు ఈ వినయాక చవితి నాడు తాలికలతో పూజించి మరి వరాలు కురిపించమని కోరుకుంటారు. అయితే ఈ తాలికలు ఎలా చేస్తారో తెలుసుకుందామా!


కావలసినవి: నీళ్ళు లేదా పాలు:

1 గ్లాసు బియ్యప్పిండి: 1కప్పు బెల్లంతురుము: 2కప్పులు ఎండుకొబ్బరి ముక్కలు: 2 టీస్పూన్ల జీడిపప్పు, బాదం పలుకులు: 1/2 కప్పు ఏలకుల పొడి: 1 టీ స్పూన్

తయారు చేయు విధానం: 1. ముందుగా గిన్నెలో ఒకటిన్నర గ్లాసుల నీరు లేదా పాలు పోసి స్టౌమీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి పోస్తూ, ఉండలు లేకుండా కలపాలి. 2. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చల్లార్చాలి. 3. తర్వాత మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, మరుగుతుండగా రెండు గ్లాసుల బెల్లం వేసి కలపాలి. 4. ఉడికించిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, సన్నగా తాల్చి, మరుగుతున్న పాకంలో వేయాలి. 5. ఏలకుల పొడి వేసిన తర్వాత బాదం జీడిపప్పు పలుకులు, కొబ్బరి ముక్కలు నెయ్యిలో వేయించి, ఇందులో కలపాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: