వినాయక చవితి రాబోతున్నది. హైదరాబాద్  లో వినాయక చవితి ఒక రేంజ్ లో జరుగుతుంది. దేశం దృష్టిని ఆకర్షించేలా గణేష్ ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అయితే గణేషుడు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ఆయన నిండైన పొట్ట. గణేషుడు ఎంత నిండైన పొట్టతో ఉంటే అంత గొప్ప విగ్రహం తయారు చేసినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు.   ఎప్పటికప్పుడు కొంత ఆలోచనలతో విగ్రహాలను తయారుచేసే తయారీదారులు.. ఆ మద్య ‘బాహుబలి 2’ ఫీవర్‌ను అందిపుచ్చుకున్నారు.

hindu outfits oppose fashionable ganeshas floated by Hyderabad youth

అందుకు అనుగుణంగానే ‘బాహుబలి 2 ’కి సంబంధించిన వివిధ రూపాలను తయారుచేశారు. అలా రూపొందించిన విగ్రహాలు ఈ సారి గణేష్‌ నవరాత్రుల్లో  చేస్తున్నాయి. అలా దేశవ్యాప్తంగా అక్కడక్కడా కనిపించిన విగ్రహాలను, సినిమాలోని పాత్రతో పోల్చి చూపుతూ కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వినాయుడి ప్రతిమల  ఆకారాల్లోనూ మార్పులు చేర్పులు చేస్తున్నారు విగ్రహ తయారీదారులు.


గత పదేళ్ల కాలంలో ఈ మార్పులు గణనీయంగా చోటు చేసుకుంటున్నాయి. తొలిసారిగా 6 ప్యాక్, 8 ప్యాక్ గణేషులు కొలువుదీరి అందరినీ ఆకర్షించారు. భారీ పొట్టతో నిండుగా ఉండే గణపయ్య స్థానంలో కండలు  పెరిగి పొట్ట లోపలికి వెళ్లి 6ప్యాక్, 8ప్యాక్ లో చూడడం కొందరికి ఇష్టం ఉన్నా మరికొందరు భక్తులు మాత్రం సహించలేకపోతున్నారు.మొత్తానికి ఈసారి మరి కొత్త తరహా గణేషు రూపాల కోసం జనాలు ఎదురుచూపులు ఫలిస్తాయా లేక భక్తుల కోరిక మేరకు నిజమైన గణేష్ ఆకారంలో దర్శనమిస్తరా అన్నది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: