మన హిందు సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచార వ్యవహారాలు వెల కట్టలేనివి. మన పురాణాలు ఇతిహాసాలు మనకు ఎలా జీవించాలి అని చెప్పాయి. అలాగే దేవతల రూపాలు నుంచి కూడా మనం అనేకం తెలుసుకోవచ్చు.  వినాయక చవితి భారతీయ పండుగలలో ఒకటి. పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు. పురాణ గాథలలో శివుడు వినాయకుడిని అందరు దేవతలలోకి మిన్నగా ప్రకటించిన రోజు. వినాయకుని జ్ఞానానికి, సంపత్తుకి మరియు మంచి అదృష్టానికి దేవతగా మరియు ప్రయాణం ప్రారంభించేటప్పుడ, లేక కొత్త పనులు చేపట్టేటప్పుడు ప్రార్థించటం సర్వసాధారణం.
Image result for eco ganapati
ఈ పండుగ బాధ్రపద మాసంలో శుక్ల చతుర్థి (చందమామ వృద్ధిచెందే 4 వ రోజున) ప్రారంభమవుతుంది. 19 ఆగస్టు నుండి 15 సెప్టెంబరు మధ్యలో ఈ రోజు వుంటుంది. ఈ పండుగ 10 రోజులపాటు అనంత చతుర్దశి (వృద్ధిచెందే చందమామ 14 వ రోజున) ముగుస్తుంది. ఇక వినాయక చవితి అనగానే విగ్రహాల తయారీ దారులు బిజీ బిజీగా ఉంటారు.  అయితే ఈ మద్య ఇకో వినాయకుడు అంటూ మట్టి వినాయకుల ప్రతిమలు తయారు చేస్తున్నారు.  ఇందులో చిన్నా, పెద్ద అందరూ తమ ఇండ్ల వద్దనే వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. 
Image result for eco ganapati
తాజాగా కొంత మంది చిన్నారులు..ఆట విడుపుగా రొంపిచెర్ల చెరువులోని మట్టితో వినాయక విగ్రహం చేశారు. అనంతరం చిన్నారులంతా కలిసి '' పర్యావరణాన్ని రక్షిస్తాం-మట్టి వినాయకుడి విగ్రహాలను వాడుతాం'' అని నినాదాలు చేశారు.  వేలకు వేలు ఖర్చు చేసి కెమికల్ తో తయారు చేసి చెరువుల్లో, కుంటల్లో, సాగరంలో  నిమార్జనం చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని అందుకే ఈ మట్టి వినాయక విగ్రహం చేశామని చిన్నారులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: