ఈ రోజు వినాయక చవితి. ఆధ్యాత్మికపరంగా చూసుకుంటే తొలి వేలుపు. విఘ్నాలను తొలగించే ఇల వేలుపు. మొదటి పూజను అందుకునే ఘనమైన గణపతి. విద్యలకు అధిపతి. దేనికైనా ఆద్యుడు. ఆరాధ్యుడు. పాహి పాహి అంటే పాపాలను మొత్తం హరించే పరమ దయాళువు. అందుకే ఆ స్వామికి ప్రణమిల్లుతోంది సమస్త జగం, భక్తిగా సమర్పిస్తుంది నీరాజనం.


స్పూర్తిగా :


వినాయకుడు భక్తిలోనే కాదు అన్నిటా ఎల్ల లోకాలకూ స్పూర్తి. ఆయన తనలోని లోపాలను అధిగమించి విజయాలను ఎలా సాధించాడన్నై వినాయకుని  కధలో మనకు తెలుస్తుంది. గజముఖంతో వక్ర తుండంతో కనిపించే వినాయకుడు గజాధ్యక్ష పదవిని ఎలా సాధించాడన్నది ఒక్కసారి చూసుకుంటే ఆయన మేధస్సు  గురించి భక్తులంతా అర్ధం చేసుకోగలుగుతారు. 


తల్లితండ్రుల చుట్టు ప్రదక్షిణం :


గజాద్యక్ష  పదవికి పోటీ వచ్చినపుడు తమ్ముడు కుమారస్వామి ముందుగానే లోకాలను చుట్టేసేందుకు తన నెమలి వాహనంపై బయల్దేరి వెళ్ళిపోతారు. మరి వినాయకుడు మంద గమనుడు, ఎలుక వాహన ధారి. మరి ఎలా లోకాలన్నింటినీ వేగంగా తిరిగి రావాలి. ఈ పోటీ వచ్చినపుడు గణపతి తెలివిగా ఆలోచన చేశాడు. మొత్తం జగత్తునే తమలో ఇముడ్చుకున్న తల్లి తండ్రులే ఎదురుగా ఉన్నపుడు ఇంక వేరే లోకాలంటూ బయల్దేరడం  దేనికి అనుకున్నాడు. పరమేశ్వరుడు, పరమేశ్వరిని భక్తితో మూడు మార్లు చుట్టి వచ్చాడు. అంతే ఈ పరీక్షలో నెగ్గాడు. ఇది వినాయకుని సమయస్పూర్తి. ఇది అందరికీ  స్పూర్తి.


నాయకత్వ  లక్షణాలు :


ఎంతటి పెద్ద నాయకుడైనా మొదటిగా గల్లీలో జయించాల్సిందే. ఆ విధంగా చూసుకున్నపుడు వినాయక చవితి పందిళ్ళే వారికి శిక్షణాలయాలు అవుతాయి. అలా చూసుకుంటే వినాయకుడు ఇచ్చె మొదటి శిక్షణ ఎన్నతగినది. నలుగురిని పోగు చేసి చవితి ఉత్సవాలను జరపడంతోనే దక్షత బయట పడుతుంది. రేపటి రోజున గట్టి నాయకునిగా ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. అందుకే నాయకులకే నాయకుడు మన వినాయకుడు.



మరింత సమాచారం తెలుసుకోండి: