ఆశ్వయుజ  మాసం శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు "శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు"  అంటారు. దశమి రోజు విజయదశమి లేదా దసరా పండగ జరుపుకుంటారు. ఈ అశ్వయుజ మాసం, కార్తీక మాసాలు శరదృతువు లో వస్తాయి. ఈ శరత్కాలములో చంద్రకాంతి దేదీప్యమానంగా ఉంటుంది. మంచి వెన్నెల తెల్లని దూదిపింజలు పరచినట్లు ఉంటుంది. ఈ తొమ్మిది రోజులు పార్వతీ దేవికి (అమ్మవారికి) అత్యంత ప్రియమైన రోజులు. అమ్మవారి కి సాధారణంగా సాయం సమయము లోనే  దేవాలయాల్లో  పూజలు నిర్వహిస్తారు. 

nava durga devi images కోసం చిత్ర ఫలితం

మామూలు రోజుల మాదిరిగా కాకుండా శరన్నవ రాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం) గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః

దేవి విగ్రహ ప్రతిష్ట

అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూఢియయిన  దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది.ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’  రాగి రేకు మీద లిఖించబడిన యంత్రాన్ని పూజించవచ్చును.


‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం!  చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’దేవీమాత లోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం మరియు లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు  స్వయం  ప్రకటితమై త్రిమూర్తులకు శక్తి ప్రదానం చేస్తూ సృష్టి, స్థితి, లయకారిణు లై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవ రాత్రోత్సవాలలో అమ్మవారిని రోజు కొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తి ని పూజించడం జరుగు తుంది.  దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. "మూలా నక్షత్రం" తో కూడిన రోజు సరస్వతీ దేవి అలంకారం లో శ్వేతాంబరధారిణిగా, వీణాపాణి యై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి "ఐం"  బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలక మౌతాయి.

పూజా విధానం

పాడ్యమి నాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోడషోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే!పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం.అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్నది కాలాతీతమైన  అభిప్రాయం.  సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే.\

Muggurammalu కోసం చిత్ర ఫలితం

ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి. దశమి నాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి.  ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా శమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేస్తాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమిరోజు జమీవృక్షాన్ని పూజించడం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచడం ఆనవాయితీగా మారాయి.


ఆయుధ పూజదేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. అందుకే అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది. మహిమాన్వితమైన దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో కావించే పూజావిధులే గాక దశమి విజయదశమిగానూ, దసరాగానూనూ పిలువబడుతూ పండగ ఉత్సాహం అంతటా వెల్లివిరుస్తుంది. విశ్వం అంతటా భక్త్యా వేశమే కానవస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: