జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.  దీపావళిని ప్రముఖంగా దీపాల పండగ అనికూడా పిలుస్తారు.  హిందువులకి ఎంతో ముఖ్యమైనది ఈ పండగ, దీన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దీవాలి అని కూడా పిలిచే ఈ పండగ రెండు పదాలు 'దీప్’ మరియు 'ఆవళి’ అంటే దీపాల వరుసతో పేరుపొందింది.  

Related image

చీకటిని తోలుతూవెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్య రాత్రిని పిండారబోసినట్లు అనిపించే వెన్నెల వెలుతురుతో నింపేసే పండుగ. కులమతాలు, వయోబేధాలు ఉండవు.  తెల్లవారుజామునే లేచి తల స్నానం చేయడం మంచిది. కొత్త బట్టలు కట్టుకోవడం కాని పక్షంలో శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించాలి. పూజగదిలో పటాలకు గంధము, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి.

Image result for దీపావళి విశిష్టత

లక్ష్మీదేవి పటం ముందు ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులు సిద్ధం చేసుకోవాలి. సాయంకాల ప్రదూష సమయంలో దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకిరంచాలి. తదనంతరం టపాసులు కాలుస్తూ పండగని జరుపుకుంటారు. దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు.


సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ !

శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వద !!

పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: