హిందువులు అత్యంత పరమ పవిత్రంగా కొలుచుకునే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు..అయితే ఈ దీపావళి మహాలక్ష్మీ తల్లికి ఎంతో ప్రత్యేకమైన పండుగట..నిత్యం దీపాలతో కళకళలాడే ఇళ్ళు ఉన్న చోట తప్పకుండా మహాలక్షి కొలువై ఉంటుందని ప్రసిద్ది. ఈ పండుగ చేసుకోవడానికి ఎంతో మంది ఎన్నో కారణాలు చెప్తారు పురాణాల ప్రకారం అనేక కారణాలు ఈ పండుగలో దాగున్నాయి..దీపావళి వచ్చిందంటే చాలు కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు...సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది.

 Related image

దీపావళి పండుగ రోజున చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ  టపాకాయలు కాల్చడం ముందు నుంచీ వస్తున్నా ఆనవాయితీ ఇది మన తెలుగు వారికి అదేవిధంగా మిగిలిన  దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వస్తుంది దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, చేకూరుతాయని మహిళలు ఎక్కువగా విశ్వసిస్తారు.

 Image result for mahalakshmi god diwali

అయితే దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు ఎంతో కాంతివంతంగా ,నిరాటంకంగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం..అందుకే హిందూ మహిళలు లక్ష్మీ స్వరూపం అయిన  తులసి కోట ముందు తొలుత దీపాలు వెలిగించి , ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి అనంతరం  గృహమంతా దీపాలంకృతం చేస్తారు ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి కటాక్షం తప్పకుండా వారి కుటుంభాలపై ఉంటుందని ప్రగాడమైన విశ్వాసం.


మరింత సమాచారం తెలుసుకోండి: