దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అట్టహాసంగా జరుపుతారన్న విషయం తెలిసిందే. దీపాల కాంతులతో ఆలయాలు, ఇళ్లు మెరిసిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.  దీపావళి పండుగ రోజున చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు పేల్చి ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ వెలుగులతో భారత దేశం ప్రకాశించింది. ఆ మద్య  దీపావళి నాడు అంతరిక్షం నుంచి తీసిన భారతదేశ ఫొటోను ఓ వ్యోమగామి ట్విట్టర్లో పంచుకున్న విషయం తెలిసిందే. 

Image result for diwali

పండగ కాంతులీనుతున్న భారత్‌ పొటోను ఇటలీకి చెందిన పాలో నెస్పోలీ అనే వ్యోమగామి అక్టోబర్‌ 19న ట్వీట్‌ చేశారు. దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపారు.  ఈ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.   భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి.  చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

Related image

దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: